/rtv/media/media_files/2024/12/11/7QtsxvPLrU62RtEeHXHK.jpg)
Inter Supplementary Results
ఏపీలో ఇంటర్మీడియన్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల కానున్నయి. ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా విడుదల చేయనున్నారు. సప్లీ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ లో తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. లేదా మన మిత్ర’ వాట్సప్ నంబరు 9552300009 ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు.
Also Read: ఆ అడవుల్లో రూ.70 వేల కోట్ల విలువైన వజ్ర నిక్షేపాలు
ఇదిలాఉండగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్‌లో 1,35,826 మంది, సెకండియర్‌లో 97,963 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. చివరికీ ఈరోజు ఫలితాలు విడుదల చేయనున్నారు. మరోవైపు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ పేరిట అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.
Also Read: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్‌లైన్‌లో రూ.3.85 కోట్లు స్వాహా
2024-25 విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్‌లో ఎక్కువ మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులను మండల వారిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాళ్లకి ఈ షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని తెలియజేసింది.
Also Read: ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ చీఫ్ మహేష్ సంచలన ప్రకటన!
Andhra Pradesh | telugu-news | rtv-news | intermediate
Follow Us