MP Midhun Reddy : ఇనుప మంచం, పరుపు, కుర్చీ.. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి రాజభోగాలు!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జైలులో వసతుల కల్పనపై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
KTR letter to ACB: ఈ ఫార్ములా కేసులో ACBకి కేటీఆర్ లేఖ
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుధవారం ఏసీబీకి లేఖ రాశారు. విచారణలో పర్సనల్ ఫోన్ సమర్పించాలని ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులకు పంపింది. ఏసీబీ అధికారుల నోటీసులకు కేటీఆర్ బదులుగా లేఖలో సమాధానం ఇచ్చారు.
KTR: నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా: కేటీఆర్
రేవంత్ జైలుశిక్ష అనుభవించారు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒకవేళ నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటానని పేర్కొన్నారు.
Kaleshwaram EE: చెంచల్‌గూడ జైలుకు కాళేశ్వరం ఇంజినీర్
కాళేశ్వరం ఇంజినీర్ నూనె శ్రీధర్ని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. శ్రీధర్ ఇంట్లో ACB రైడ్స్ నిర్వహించింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా అక్రమాస్తులు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సోదాలు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
BIG BREAKING: కేటీఆర్‌కు బిగ్ షాక్ .. ఏసీబీ మరోసారి నోటీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఆయనకు మరోసారి నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Sheep Distribution Scam: తలసానికి బిగ్ షాక్.. గొర్రెల స్కామ్ దళారి మొయినుద్దీన్ అరెస్ట్
తెలంగాణలో అత్యంత సంచలనంగా మారిన గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసులోమొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ1 నిందితుడు మొయినుద్దీన్‌ను శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
TG High Court: అజారుద్దీన్‌కు హైకోర్టులో ఊరట.... ఆయన పేరును తొలగించవద్దని...
అజారుద్దీన్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కి అజారుద్దీన్ పేరు తొలగించవద్దని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ క్రికెట్ సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది.
ENC Bhookya Hari Ram : కాళేశ్వరాన్ని ముంచి..అక్రమ ఆస్తులు పెంచి...ఈఎన్సీ హరిరామ్ అక్రమ ఆస్తులు రూ.200 కోట్ల పైనే...
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ భుక్యా హరిరామ్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. శనివారం రాత్రి వరకూ గుర్తించిన అక్రమాస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.