/rtv/media/media_files/2025/11/21/fotojet-2025-11-21t085113540-2025-11-21-08-51-44.jpg)
Formula E Race Case
Formula E Race Case: ఫార్ములా-ఈ రేసు కేసు కేటీఆర్(ktr e formula race case) మెడకు చుట్టుకొంటోంది. ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.ఈ విషయంలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని ఏసీబీ ఆరోపిస్తోంది.కొంతమంది ప్రైవేటు వ్యక్తుల కోసమే ఈ రేసును నిర్వహించారని, వారి ప్రతిపాదనను నాటి ప్రభుత్వం తన మీద వేసుకున్నదని, దీనివల్ల ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయిందని, ఈ మొత్తం ప్రక్రియలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. అవినీతి నిరోధక శాఖ ఆరోపిస్తోంది. కాగా ఈ కేసులో ఫార్ములా-ఈ ఆపరేషన్స్(ఎఫ్‌ఈవో) ప్రతినిధి అల్బెర్టో లాంగోతోపాటు ప్రైవేటు కన్సల్టెంట్ గువ్వాడ కృష్ణారావును కూడా నిందితులుగా చేర్చినట్లు తెలిపింది.
Also Read : నాగార్జున, వెంకటేష్‌లకు షాక్.. స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు
ACB Makes Sensational Allegation That ‘Formula E’
కాగా, నివేదిక లోని అంశాలను బట్టి హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసు(9Formula E Car Race Case Scam) నిర్వహించాలని ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలుస్తోంది. 2021 నవంబరులో కొంతమంది ప్రైవేటు వ్యక్తుల మధ్య చర్చ మేరకు ఈ మొత్తం వ్యవహారానికి తెరలేచిందని ఏసీబీ ఆరోపించింది..ఈ కేసులో ఎ-4గా చేర్చిన అంతర్జాతీయ క్రీడల కన్సల్టెంట్ గువ్వాడ కృష్ణారావు దీనికి ఆధ్యడని తెలుస్తోంది. భారత్‌లో ఫార్ములా-ఈ రేసు తీసుకురావాలని భావించిన ఆయన తన పాత మిత్రుడు దిల్‌భాగ్ గిల్‌తో చర్చించారు. ఇదే విషయమై 2021 నవంబరు 18న టీహబ్‌లో ఇచ్చిన ప్రజంటేషన్‌లో వీరు పాల్గొన్నారు. ఆర్థిక, వ్యాపారపరమైన సహకారం కోసం గువ్వాడ కృష్ణారావు.. గ్రీన్‌కో వ్యవస్థాపకుడు చెలమలశెట్టి సునీల్‌ను సంప్రదించినట్లు తెలిసింది. అనంతరం మరోసారి జరిగిన సమావేశానికి కేటీఆర్‌తోపాటు పలువురు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. దీన్నిబట్టి ఫార్ములా ఈ కుట్ర ప్రభుత్వం నుంచి మొదలుకాలేదని.. ప్రైవేటు వ్యక్తులే శ్రీకారం చుట్టారని అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) పేర్కొంది.
సునీల్ తదితరులతో సమావేశం అయిన తర్వాత అధికారికంగా ఎలాంటి చర్యలు చేపట్టకుండానే కేటీఆర్ స్వయంగా తనంతతాను ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడే అవినీతికి బీజం పడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా 2022 జనవరి 17న ఫార్ములా-ఈ ఆపరేషన్స్ తరఫున కేసులో ఏ-5గా ఉన్న అల్బెర్టో లాంగోతోపాటు అర్వింద్‌కుమార్, సునీల్‌లు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేసినట్లు తెలిపారు. అయితే ఈ లెటర్‌పై సంతకం చేసేందుకు అర్వింద్‌కుమార్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఏసీబీ తెలిపింది. ఈ రేసు నిర్వహణ కోసం సునీల్ ఏస్‌నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఇతరత్రా వ్యవహారాలు చూసే బాధ్యతను కృష్ణారావు తీసుకున్నారు. ఇందుకోసం కృష్ణారావు.. ఏస్ సంస్థ నుంచి ఏడాదికి రూ.1.9 కోట్ల వేతనం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. అప్పటి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న కేటీఆర్ ఆదేశాల ప్రకారమే నడుచుకున్న అర్వింద్‌కుమార్ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి రేసు నిర్వహణకు ఒప్పందం కుదుర్చున్నారని తెలిపింది. తద్వారా ఆర్థిక అవకతవకలు జరగడానికి కారణమయ్యారని ఏసీబీ పేర్కొంది.
Also Read: Nikhat Zareen: తెలంగాణ బాక్సర్ నిఖత్ ఖాతాలో మరో స్వర్ణం
Follow Us