Surveyor: ఛీ.. చీ ఇదేం పని.. అయ్యప్ప మాలలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్

పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఇద్దరు ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు. సర్వేయర్ రూ.1లక్ష లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. హైదరాబాద్–సికింద్రాబాద్ MRO ఆఫీస్‌లో సర్వేయర్, అతని సహచరుడు అవినీతికి పాల్పడ్డారు.

New Update
MRO office

పవిత్రమైన అయ్యప్ప మాల(Ayyappa Mala) ధరించి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు(Bribe Case) తీసుకుంటూ దొరికిపోయారు. సర్వేయర్ రూ.1లక్ష లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ(acb-raid)కి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. హైదరాబాద్ – సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయం(Hyderabad MRO office)లో అయ్యప్ప మాల వేసిన సర్వేయర్, అతని సహచరుడు పాపానికి ఒడిగట్టారు. అయ్యప్ప మాలలో ఉన్నాం.. ఎవరూ అనుమానించరులే అని భావించి వసూళ్లకు పాల్పడ్డారు. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడి చేయడంతో పట్టుబడ్డారు.

Also Raed :  లవర్ వదిలేసి వెళ్లాడని.. ఇద్దరు పిల్లల తల్లి సూసైడ్

Surveyor Caught By ACB

దీంతో వీరి భాగోతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయప్ప మాల ధరించి అవినీతికి పాల్పడతారా అంటూ నెటిజన్లు, స్వామి భక్తులు ఫైర్ అవుతున్నారు. సర్వేయర్ కిరణ్, అతని సహచరుడు భాస్కర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Also Read :  ఘోర బస్సు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా - 25 మంది స్పాట్‌లోనే..!

Advertisment
తాజా కథనాలు