/rtv/media/media_files/2026/01/23/assets-2026-01-23-20-46-09.jpg)
రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కందడి మధుసూదన్‌రెడ్డి అవినీతి బాగోతాన్ని ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు, ఆయనపై కేసు నమోదు చేసి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మధుసూదన్‌రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన మొత్తం ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో సుమారు రూ. 7.83 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. బయట మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ వందల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మధుసూదన్‌రెడ్డికి ఒక మూడంతస్తుల స్వంత ఇల్లు, ఖరీదైన ఓపెన్ ప్లాట్లు, 27 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఒక ఎకరం వాణిజ్య భూమి ఉన్నట్లు గుర్తించారు. ఇవే కాకుండా స్విమ్మింగ్ పూల్‌తో కూడిన అత్యాధునిక ఫామ్‌హౌస్ ఆయన విలాసవంతమైన జీవనశైలికి అద్దం పడుతోంది. సోదాల సమయంలో రూ. 9 లక్షల నగదుతో పాటు 1.2 కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన గ్యారేజీలో ఇన్నోవా, ఫార్చ్యూనర్, వోల్వో, వోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నట్లు తేలింది.
భారీగా పెట్టుబడులు
కేవలం స్థిరాస్తులే కాకుండా వ్యాపార రంగంలోనూ మధుసూదన్‌రెడ్డి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. ఏఆర్‌కే స్పిరిట్స్ పేరుతో నిర్వహిస్తున్న మద్యం వ్యాపారంలో దాదాపు రూ. 80 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు దొరికాయి. అంతేకాకుండా, అక్రమ సంపాదనను మళ్లించేందుకు తన భార్య, పిల్లల పేర్లతో రెండు షెల్ కంపెనీలను కూడా ఏర్పాటు చేసినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా 9440446106 వాట్సప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
Follow Us