BIG BREAKING: ట్రంప్ పై ఇరాన్ డ్రోన్ దాడి?
తమపై దాడులు చేసినందుకు అమెరికాపై ఇరాన్ రగిలిపోతోంది. ప్రస్తుతానికి కామ్ గా ఉన్నా ఎప్పటికైనా ఆ దేశంపై దాడులు చేయవచ్చని సంకేతాలిస్తోంది. ఇందులో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ పై డ్రోన్ దాడి చేస్తామని హెచ్చరించారు.
తమపై దాడులు చేసినందుకు అమెరికాపై ఇరాన్ రగిలిపోతోంది. ప్రస్తుతానికి కామ్ గా ఉన్నా ఎప్పటికైనా ఆ దేశంపై దాడులు చేయవచ్చని సంకేతాలిస్తోంది. ఇందులో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ పై డ్రోన్ దాడి చేస్తామని హెచ్చరించారు.
యుద్ధం జరిగినప్పటినుంచి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కనిపించకుండా పోయారు. తాజాగా ఆయన బయటికొచ్చారు. శనివారం సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ మసీదులో జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఇరాన్లో ఫత్వా జారీ అయ్యింది. ట్రంప్, నెతన్యాహులను శత్రువులుగా పేర్కొంటూ మతపెద్ద అయతుల్లా నాసర్ మకరెం షిరాజీ ఈ చర్యలు తీసుకున్నారు.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ కోఫౌండర్ హకామ్ మహమ్మద్ ఇస్సా అల్-ఆస్సా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని సబ్రాలో జరిగిన వైమానిక దాడిలో హకామ్ మృతి చెందాడు.
12 రోజుల పాటు ఇజ్రాయెల్‌పై సాగిన యుద్ధంలో తమ దేశమే గెలిచిందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. అలాగే తాము అమెరికా స్థావరాలపై కూడా దాడులు చేసి ఆ దేశానికి చెంపదెబ్బ కొట్టామన్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటిదాకా బాహ్య ప్రపంచానికి కనిపించకుండా వెళ్లిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ ఆయన బయటకి రాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించడం ఆశ్చర్యంగామారింది. ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో.. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. అవి చాలా భవనాలను ధ్వంసం చేశాయని అన్నారు.
అమెరికా ఇరాన్‌పై జరిపిన దాడుల్లో అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై వెల్లడించారు. ఇజ్రాయెల్‌కు సపోర్ట్‌గా అమెరికా B-2 బాంబర్లతో తీవ్రంగా దాడులు చేయడం వల్ల ఈ నాశనమయ్యాయని తెలిపారు.
అమెరికా దాడుల కంటే ముందే ఇరాన్ అణు కేంద్రాలైన నంతాజ్, ఫోర్డో, ఇస్ఫాహాన్ ల నుంచి 400 కేజీల యూరేనియం వేరే చోటుకి తరలించింది. అమెరికా ఎత్తును ఇరాన్ తిప్పి కొట్టింది. ఈ విషయంలో అమెరికా ఓటిపోయింది. ట్రంప్ మోసపోయాడు.