/rtv/media/media_files/2025/07/06/khamenei-2025-07-06-11-11-46.jpg)
Khamenei
ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇరాన్‌లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆ తర్వాత ఇరాన్ కూడా డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. చివరికి అమెరికా జోక్యంతో ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. యుద్ధం జరిగినప్పటినుంచి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కనిపించకుండా పోయారు. ఆయన రహస్య బంకర్‌లో తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన బయటికొచ్చారు.
Also Read: టాయిలెట్‌లో ఉండి వర్చువల్ విచారణ.. కోర్టు కీలక ఆదేశం
శనివారం సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ మసీదులో జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇజ్రాయెల్‌తో యుద్ధం తర్వాత ఆయన బయటికి రావడం ఇదే మొదటిసారి. ఖమైనీ ఈ కార్యక్రమానికి రావడంతో అక్కడున్న వారంతా లేచి నిలబడ్డారు. ఆయనకు మద్దతుగా పిడికిలి బిగించి నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
📹 لحظه ورود رهبر انقلاب به حسینیه امام خمینی(ره) در مراسم عزاداری شب عاشورای حسینی#عاشوراpic.twitter.com/09mfwm3qFM
— خبرگزاری تسنیم 🇮🇷 (@Tasnimnews_Fa) July 5, 2025
Also Read: ఇండోనేషియాలో వరుస భూకంపాలు.. వణికిపోతున్న ప్రజలు
ఇదిలాఉండగా ఇటీవల ఇజ్రాయెల్ రైజింగ్ లయన్ ఆపరేషన్ పేరిట ఇరాన్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఖమేనీ నివాసంతో సహా ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియే ప్రాంతంలో కూడా వైమానికి దాడులకు పాల్పడింది. దీంతో ఆయన ఓ రహస్య బంకర్‌లో ఆశ్రయం పొందారు. ఆయన ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌ను కూడా అధికారులు నిలిపివేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన కీలక సైనిక కమాండర్లు, అణు శాస్త్రవేత్తలకు నిర్వహించిన అంత్యక్రియలకు కూడా ఖమేనీ హాజరవ్వలేదు.