Alie Khamenie: కాల్పుల విరమణ జరిగినా బయటకు రాని ఖమేనీ.. హత్యకు ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్ !

ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటిదాకా బాహ్య ప్రపంచానికి కనిపించకుండా వెళ్లిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ ఆయన బయటకి రాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.

New Update
Ali Khamenie

Ali Khamenie

ఇజ్రాయెల్‌ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో గత కొన్నిరోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చల్లారాయి. అయితే ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటిదాకా బాహ్య ప్రపంచానికి కనిపించకుండా వెళ్లిపోయారు. ఆయన రహస్య బంకర్‌లో తలదాచుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ ఖమేనీ ఇంకా బయటకి రాలేదు.  

Also Read: అంతరిక్షంలో ఆరోగ్యం బాగోలేదన్న ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా

Alie Khamenie

ఇరాన్ ప్రభుత్వ టీవీలో దీనిపై ఖమేనీ ఆర్కైవ్స్‌ ఆఫీస్‌ అధిపతి మెహదీ ఫజైలీని ప్రశ్నించారు. ఆయన కూడా ఖమేనీ గురించి సరిగా సమాధానం చెప్పలేకపోయారు. టీవీ కార్యక్రమంలో యాంకర్‌ మెహదీని.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడున్నారో చెప్పగలగా అని అడిగారు. దీనికి స్పందించిన ఆయన '' నన్ను చాలామంది ఈ ప్రశ్న అడిగారు. ఖమేనీ జాడపై ఆందోళనకు గురవుతున్నారు. మనం ఆయన కోసం ప్రార్థనలు చేద్దాం. సుప్రీ లీడర్‌కు రక్షణగా ఉన్నవారు తమ విధులు నిర్వహిస్తున్నారు. మన ప్రజలు ఆయనతో కలిసి విజయోత్సవాలు జరపుకొంటారని'' మెహదీ అన్నారు.   

Also Read: ట్రంప్ ఎవడికీ అర్థం కాడు.. ఇరాన్‌పై ముందు బాంబులు, ఇప్పుడు ప్రశంసలు

ప్రస్తుతానికి ఇరాన్‌ అధినేత ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్లకు దూరంగా బంకర్‌లో ఉన్నట్లు అధికారికంగా తెలిపారు. అయితే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత కూడా ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు ఇరాన్ పొలిటికల్ నిపుణులు హమ్జా సఫావీ దీనిపై స్పందించారు. కాల్పుల విరమణ జరిగిన తర్వాత కూడా ఖమేనీని హత్య చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దీంతో ఆయనకు భద్రత మరింత పెంచినట్లు పేర్కొన్నారు.   

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. మహిళా మావోయిస్టులు మృతి

Also Read :  Kannappa: విడుదలకు ముందే 'కన్నప్ప' రికార్డ్.. ఫుల్ జోష్ లో మంచు విష్ణు!

 

rtv-news | telugu-news | ali khamenei | ceasefire

Advertisment
Advertisment
తాజా కథనాలు