Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ట్రంప్‌, నెతన్యాహులపై 'ఫత్వా'

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఇరాన్‌లో ఫత్వా జారీ అయ్యింది. ట్రంప్, నెతన్యాహులను శత్రువులుగా పేర్కొంటూ మతపెద్ద అయతుల్లా నాసర్‌ మకరెం షిరాజీ ఈ చర్యలు తీసుకున్నారు.

New Update
Iran's Top Cleric Issues Fatwa Against Trump, Netanyahu

Iran's Top Cleric Issues Fatwa Against Trump, Netanyahu

Iran: ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన యుద్ధం ముగిసిన సంగతి తెలిసిందే. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. తమపై దాడులు చేయడంతో ఇజ్రాయెల్, అమెరికా వైఖరిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. మొత్తానికి కాల్పుల విరమణ జరిగినప్పటికీ తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఇరాన్‌లో ఫత్వా జారీ అయ్యింది. ట్రంప్, నెతన్యాహులను శత్రువులుగా పేర్కొంటూ మతపెద్ద అయతుల్లా నాసర్‌ మకరెం షిరాజీ ఈ చర్యలు తీసుకున్నారు.  

Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. బెయిల్‌కు ఆర్థిక సాయం

ఇస్లామిక్ రిపబ్లిక్‌ నాయకత్వంపై బెదిరింపులకు పాల్పడుతున్న ట్రంప్, నెతన్యాహును ఓడించాలని నాసర్ మకరెం పిలుపునిచ్చారు. ఇస్లామిక్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్‌కు సహకారం అందించడం నిషేధమని, వాళ్ల తప్పులకు పశ్చాత్తాపపడేలా చేయడం అవసరమని తెలిపారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇస్లామిక్ రిపబ్లికన్ నాయకత్వానికి వ్యతిరేకులగా పరిగణించినవాళ్లకి ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్ష కూడా విధించే ఛాన్స్ ఉంటుంది.  

Also Read: కేంద్రం కొత్త పథకం..  రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు..!

ఇదిలాఉండగా ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమెరికా కూడా వాటిపై దాడుల చేసింది. బీ2 బాంబర్ల ద్వారా బంకర్‌ బస్టర్‌లను జారవిడిచింది. ఈ దాడులపై ట్రంప్‌ కూడా మరోసారి స్పందించారు. తాము సులభంగా ఫోర్డో అణు స్థావరంపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. బాంబులను అడ్డుకునేందుకు ఇరాన్ ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. ఫోర్డోతో పాటు మూడు అణు స్థావరాలు పూర్తిగా ధ్వంసమైనట్లు స్పష్టం చేశారు. 

Also Read: వివాహేతర సంబంధం .. రిసార్ట్‌లో బావ, మరదలు ఆత్మహత్య!

Also Read: Anchor Swetcha : యాంకర్‌ స్వేచ్ఛ కేసులో బిగ్‌ట్విస్ట్‌...ఆమె మరణానికి పూర్ణనే కారణం..?

Advertisment
Advertisment
తాజా కథనాలు