Iran: హామీ ఇస్తే చర్చలకు సిద్ధం..ఇరాన్

అణు చర్చలపై ఇరాన్ మళ్ళీ మాట్లాడింది. దాడులు చేయమని హాయీ ఇస్తే అమెరికా తో చర్చలకు సిద్ధమని తెలిపింది. అంతకు ముందు అణు చర్చలు జరిపే ఉద్దేశం లేదని చెప్పిన ఇరాన్ ఇప్పుడు కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. 

New Update
iarn warning

Iran Warning

ఇరాన్ లో అణు సంపద, ఆయుధాల తయారీ..ప్రపంచంలో ఇదో పెద్ద హాట్ టాపిక్. ఆ దేశంలో అణు కేంద్రాలు ఉండకూడదు, ఆయుధాలు తయారు చేయకూడదు అంటోంది అగ్రరాజ్యం అమెరికా. దీనికి ఇజ్రాయెల్ తో సహా చాలా దేశాలు వత్తాసు పలుకుతున్నాయి. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే డేజర్ అని అంటున్నారు. కానీ మరోవైపు ఇరాన్ మాత్ర అందిలాగే మా దగ్గర అణ్వాయుధాలు ఉంటే తప్పేంటి అని ప్రశ్నిస్తోంది. అమెరికా ఎంత అడిగినా, ఎన్ని చర్చలు చేసినా అణు ఒప్పందానికి ససేమిరా అంది. చేసి ప్రయత్నాలు అన్నీ విఫలం అవడంతో ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్ మీద దాడులు చేశాయి. అక్కడ అణు కేంద్రాలను పాక్షికంగా దెబ్బతీశాయి. దాని తరువాత  కాల్పుల విరమణకు వచ్చాయి. కానీ ఇప్పటికీ అమెరికా అణు ఒప్పందం గురించి ఆ దేశం మీ వత్తిడి తెస్తూనే ఉంది. అయితే ఇరాన్ మాత్ర చర్యలు జరిపే ఉద్దేశం లేదని చెబుతూ వచ్చింది ఇంతవరకు.

సంక్లిష్టంగా పరిస్థితులు..కానీ..

అయితే తాజాగా ఇరాన్ కాస్త వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. తమపై మళ్ళీ దాడులు చేయమని హామీ ఇస్తే చర్చలకు వస్తామని చెప్పారు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ . టెహ్రాన్‌లోని విదేశీ దౌత్యవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఇరాన్ అణు కేంద్రాలపై చేసిన దాడులు పరిస్థితులను సంక్లిష్టం చేశాయని.. అందుకే హామీ కోరుతున్నామని చెప్పారు. అణు కేంద్రాల తనిఖీల విషయంలో ‘ఐఏఈఏ’ విజ్ఞప్తిపై దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమాధానం ఇస్తామని చెప్పారు. తమ ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని ఏజెన్సీ తనిఖీలు ఉండాలన్నారు. అణు కేంద్రాలపై ఇటీవలి దాడులతో రేడియోధార్మిక పదార్థాల వ్యాప్తి ముప్పు అధికంగా ఉందన్నారు.

Also Read: BIG BREAKING: చేసిందంతా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డే.. వినుత సంచలన ఆరోపణలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు