ట్రంప్ ఎవడికీ అర్థం కాడు.. ఇరాన్‌పై ముందు బాంబులు, ఇప్పుడు ప్రశంసలు

ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించడం ఆశ్చర్యంగామారింది. ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో.. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. అవి చాలా భవనాలను ధ్వంసం చేశాయని అన్నారు.

New Update
Trump Sensational Comments on Iran

Trump Sensational Comments on Iran

ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో.. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. అవి చాలా భవనాలను ధ్వంసం చేశాయని అన్నారు. ఇరానియన్ క్షిపణులు కలిగించిన భారీ నష్టాన్ని ఆయన అంగీకరించారు. అంతకుముందు, ట్రంప్ ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని డిమాండ్ చేశాడు. ఖమేనీ ఆ డిమాండ్‌ను తీవ్రంగా తిరస్కరించారు, ఇరాన్ ఎప్పుడూ ఏ దేశానికీ తలవంచదని. అలాగే అల్లాహ్ ముందు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేస్తుందని పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయిల్ కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ కొత్తగా మాట్లాడుతున్నారు. ఇరాన్‌లో పాలన, పాలకులను మార్చాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు. ఈ మాటలను కూడా ప్రస్తుతం వెనక్కి తీసుకున్నారు.

ఇజ్రాయెల్ రక్షణ దళాల అంచనాల ప్రకారం, యుద్ధంలో ఇరాన్ 1,000 కి పైగా క్షిపణులను ప్రయోగించింది. వాటిలో గణనీయమైన సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. షహాబ్-3, ఖోర్రామ్‌షహర్-4, సెజ్జిల్ లాంటి విధ్వంసకరమైన క్షిపణులను ఇరాన్ ఇజ్రాయిల్‌పై ప్రయోగించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు