/rtv/media/media_files/2025/06/29/trump-2025-06-29-15-42-55.jpg)
Trump
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ సీనియర్ సలహాదారు జవాద్ లారిజాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపేస్తానని బెదిరించారు. ట్రంప్ తన విలాసవంతమైన ఇల్లు మార్-ఎ-లాగోలో సన్ బాత్ చేస్తున్నప్పుడు కాల్చి చంపబడే అవకాశం ఉందని హెచ్చరించారు. ట్రంప్ మీద డ్రోన్ తో అటాక్ చేస్తామని చెప్పారు. అతనిని చంపడం చాలా సులభమని అన్నారు. జవాద్ లారిజాని..ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి చాలా దగ్గర వ్యక్తి.
బ్లడ్ పాక్ట్ వెబ్ సైట్ ద్వారా..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అవమానించే లేదా ప్రణాలకు ముప్పు కలిగించే వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు బ్లడ్ పాక్ట్ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ పెట్టారు. దీనిలో వారు నిధులను సేకరిస్తున్నారు. వెబ్‌సైట్ ఇప్పటివరకు $27 మిలియన్లకు పైగా వసూలు చేసిందని మరియు $100 మిలియన్లను చేరుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఈ వెబ్ సైట్ లోనే ట్రంప్ ను డ్రోన్ తో చంపేస్తామంటూ ప్రకటన వచ్చింది. మరోవైపు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌తో అనుబంధంగా ఉన్న ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కూడా దీనిని ధృవీకరించింది. దాంతో పాటూ పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాలు, నగర కేంద్రాల వద్ద నిరసన తెలియజేయాలని మత సమూహాలకు విజ్ఞప్తి చేసింది. ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహులకు 'మొహరేబెహ్' వంటి ఇస్లామిక్ చట్టాలను వర్తింపజేయాలంది. అయితే దీనికి ఖమేనీ ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు.
మరోవైపు జవాద్ లారిజాని ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. ఇది తీవ్రంగా పరిగణించవలసిన విషయమని అన్నారు. తాము జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అయితే తాను సన్ బాత్ చేయనని...అదంటే తనకు చాలా చిరాకని ట్రంప్ చెప్పారు. తాను చివరిసారిగా తనకు 7ఏళ్ళు ఉన్నప్పుడు చేశానని చెప్పుకొచ్చారు.
Also Read: Kerala Nurse: యెమెన్ నర్స్ నిమిషా ప్రియను కాపాడేందుకు ప్రయత్నం..బ్లడ్ మనీ ఒక్కటే దారి