Pakistan Floods: పాకిస్తాన్లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 79 మంది మృతి!
గత కొన్ని రోజుల నుంచి పాక్లో కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపుగా 79 మంది మరణించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇంకా 130 మందికి పైగా గాయాలు అయ్యాయి. దేశ వ్యాప్తంగా వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.