Pakistan Floods: పాకిస్తాన్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 79 మంది మృతి!

గత కొన్ని రోజుల నుంచి పాక్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపుగా 79 మంది మరణించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇంకా 130 మందికి పైగా గాయాలు అయ్యాయి. దేశ వ్యాప్తంగా వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

New Update
Pakistan

Pakistan floods

పాకిస్తాన్‌కు వరుస షాక్‌లు ఎదురు అవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి పాక్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా తూర్పు పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, సింధ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మికంగా వచ్చిన ఈ వరదల వల్ల దాదాపుగా 79 మంది మరణించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇంకా 130 మందికి పైగా గాయాలు అయ్యాయి. వరదల వల్ల దేశ వ్యాప్తంగా వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వ్యవసాయ భూములు, పంటలు, రోడ్లు, వంతెనలు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

ఇది కూడా చూడండి:Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

ఇది కూడా చూడండి:Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

ఇది కూడా చూడండి:Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

నేపాల్, చైనాలో కూడా..

ఇదిలా ఉండగా ఇటీవల నేపాల్‌-చైనా సరిహద్దులో కూడా వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల వల్ల భోటెకోషి నది ఉప్పొంగింది. దీంతో మిటేరి వంతెన వరదల్లో కొట్టుకుపోయింది. నది నుంచి వరద ఉధృతంగా రావడంతో నదీ తీరం వెంబడి డ్రైపోర్టులో నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి. దాదాపుగా 200లకు పైగా వాహనాలు ఈ వరదల్లో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు