Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు బీభత్సం.. 65 మంది మృతి, 37 మంది మిస్సింగ్!

హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది.  దీంతో ప్రజల రోజువారీ జీవితం అస్తవ్యస్తంగా మారింది. కొండచరియలు విరిగిపడటం కారణంగా 65 మందికి పైగా మరణించారు

New Update
himachal-pradesh-floods

హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది.  దీంతో ప్రజల రోజువారీ జీవితం అస్తవ్యస్తంగా మారింది.

కొండచరియలు విరిగిపడటం కారణంగా 65 మందికి పైగా మరణించారు . 37 మంది తప్పిపోయారని, 110 మంది గాయపడ్డారని ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ సుఖు శుక్రవారం మధ్యాహ్నం విలేకరులకు తెలిపారు.  రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి 14 వేర్వేరు మేఘావృతాలు నమోదయ్యాయని, దీనివల్ల రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, అలాగే అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా దెబ్బతిన్నదని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని విపత్తు బాధిత కుటుంబాలకు తన ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు సీఎం.  ప్రతి కుటుంబానికి రూ. 5,000 అందజేస్తామని అన్నారు.

 కాగా జూన్ 20న హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాలు ప్రవేశించాయి. అప్పటి నుండి, వాతావరణం కారణంగా రూ.5,000 కోట్ల నష్టం వాటిల్లింది. అదనంగా, వందలాది ఇళ్ళు ధ్వంసమయ్యాయి. 

64 పశువులు మృత్యువాత

భారీ వర్షాల తర్వాత కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్‌లో రోడ్లు దెబ్బతిన్నాయి . రాష్ట్రంలో నదులు పొంగిపొర్లుతున్నాయి. దీని కారణంగా అనేక గ్రామాల మధ్య  సంబంధాలు తెగిపోయాయి. 150 కి పైగా ఇళ్ళు, 106 పశువుల కొట్టాలు , 31 వాహనాలు, 14 వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. వివిధ సంఘటనలలో 164 పశువులు మరణించాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 332 ట్రాన్స్‌ఫార్మర్లు, 784 నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ ప్రకారం సిర్మౌర్ జిల్లాలోని పచ్చాడ్‌లో బుధవారం సాయంత్రం నుండి అత్యధికంగా 133.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.

జూలై 5 నుండి 7 వరకు మూడు నుండి ఏడు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ  ఆరెంజ్ అలర్ట్  జారీ చేసింది . గిరిజన కిన్నౌర్, లాహౌల్, స్పితి జిల్లాలు మినహా ఈ వారాంతం వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ  ఎల్లో అలర్ట్  జారీ చేసింది . 

Advertisment
తాజా కథనాలు