హిమాచల్‌ ప్రదేశ్‌లో రెడ్‌ అలర్ట్‌.. మండిలో మారణహోమం

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై కొండచరియలు విరిగిపడటం, వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

New Update
Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడటం, వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది. ఆగకుండా కురుస్తున్న వర్షాలు చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక్క రోజులో 115 నుంచి -204 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 204 మిల్లీ మీటర్లు అతి  తీవ్ర వర్షపాతం కిందకు వస్తుంది.

రెడ్‌ అలర్ట్‌

హిమాచల్‌ ప్రదేశ్‌లోని కంగ్రా, సిర్మూర్‌, మండి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో చంబా, కంగ్రా, మండి, శిమ్లా, సిర్మూర్‌ జిల్లాల్లో మెరుపు వరదలు రావొచ్చని హెచ్చరించింది. ఉనా, బిలాస్‌పుర్‌, హమిర్‌పుర్‌, చంబా, శిమ్లా, కుల్లు జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. చాలా చోట్ల కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందన్నారు. బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు. ఐటీబీపీ దళాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. దీనికి తోడు బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ సాయం తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ ప్రభుత్వానికి సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు