Samantha: సమంత ఏడాదిగా సినిమాలు చేయడం లేదు. ఆరోగ్య కారణాల రిత్యా సినిమాలకు గ్యాప్ ఇస్తున్నాని చెప్పింది. కానీ ఆమె అభిమానులతో మాత్రం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో టచ్‌లోనే ఉంటూ వచ్చింది. దాంతో పాటూ ఆమె మీద ఏదో ఒక గాసిప్ కూడా వస్తూనే ఉంది. ఇక ఈరోజు సమంత మీకూ సర్ప్రైజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ మధ్యనే నాగచైతన్య, శోభిత ధూళిపాళతో ఎంగేజ్మెంట్ చేసకున్నాడు. ఆ తరువాత సమంత కూడా పెళ్ళి చేసుకుంటుంది..ఫ్యామిలీ మాన్ దర్శకుల్లో ఒకరైన రాజ్‌తో ప్రేలో ఉది అంటూ వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో సమంత వార్త అనగానే…అందరూ పెళ్ళి గురించే అనుకున్నారు. కానీ అవేమీ కాకుడా సమంత కూల్‌గా మరొక విషయాన్ని అనౌన్స్ చేసింది.
వరల్డ్ పికిల్ బాల్ లీగ్‌లో సమంత మెరిసింది. అంతేకాదు తాను ఒక జట్టు ఫ్రాంఛైజీకి యజమానిగా ఉంటున్నా అని కూడా ప్రకటించింది. వరల్డ్ పికిల్ బాల్ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ లీగ్‌లో తాను చెన్నై ఫ్రాంచైజీ యజమానిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత నటించిన సిటాడెల్ వెబ్ సీరీస్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ మధ్యనే దీని ట్రైలర్‌ను విడుదల చేశారు.
View this post on Instagram
Also Read: Andhra Pradesh: ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష