/rtv/media/media_files/2025/06/23/sriram-arrest-2025-06-23-14-27-41.jpg)
చెన్నై డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో హీరో శ్రీరామ్ ఇరుక్కున్నాడు. తిరుపతికి చెందిన శ్రీరామ్ ను ప్రస్తుతం చెన్నై పోలీసులు విచారిస్తున్నారు. రోజూపూలు సినిమాతో తెలుగు, తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్.. పలు చిత్రాలతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. డగ్స్ కేసులో ఆరోపణలపై శ్రీరామ్ ను నుంగంబాకం పోలీసులు దాదాపుగా రెండు గంటలపాటు విచారిస్తున్నారు.
శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లుగా ఆరోపణలు
ఇప్పటికే శ్రీరామ్ కు రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు కూడా నిర్వహించి రక్తనమూనాలు సేకరించారు. మాజీ AIDMK కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్టైన ప్రసాద్ తో పాటుగా మరో ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీరామ్ ను పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో శ్రీరామ్ పేరు బయటకు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. శ్రీరామ్. శ్రీరామ్ అరెస్ట్ చెన్నై సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. కాగా గతేడాది ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన వళరి సినిమాలో శ్రీరామ్ నటించారు. ఆయన హీరోగా నటించిన ఎర్రచీర విడుదలకు రెడీ అవుతోంది.