Reverse Driving: భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుంటే.. ఇరుక్కుపోయాడు

ఓ యువకుడికి ఇటీవలె పెళ్లయింది. సరదాగా భార్యను తీసుకుని కారులో అలా బయటకు వెళ్లాడు. భార్యకు సర్‌ప్రైజ్‌ ఇచ్చి ఇంప్రెస్‌ చేయాలనుకున్నాడు. తనకున్న రివర్స్‌ డ్రైవింగ్‌ టాలెంట్ తో ఆమెను ఉత్సాహ పరుద్దామనుకున్నాడు. రివర్స్‌ డ్రైవ్ చేసి అడ్డంగా బుక్కైపోయాడు.

New Update
He got stuck trying to impress his wife.

Reverse Driving : ఓ యువకుడికి ఇటీవలె పెళ్లయింది. సరదాగా భార్యను తీసుకుని కారులో అలా బయటకు వెళ్లాడు. వెళ్లినవాడు వెళ్లినట్లు ఉంటే బావుండేది కానీ, భార్యకు సర్‌ప్రైజ్‌ ఇచ్చి ఇంప్రెస్‌ చేయాలనుకున్నాడు. తనకున్న రివర్స్‌ డ్రైవింగ్‌ టాలెంట్ తో ఆమెను ఉత్సాహ పరుద్దామనుకున్నాడు. అంతే కారును రివర్స్‌లో డ్రైవ్ చేసి అడ్డంగా బుక్కైపోయాడు. దీనికి సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో అందరూ నవ్వుకుంటున్నారు.

భార్యాభర్తలు ఒకరినొకరు సర్‌ప్రైజ్ చేయాలనుకోవడం, ఒకరిని ఒకరు తమ ప్రేమను ప్రదర్శించాలనుకోవడం సాధారణం. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులోనూ కొత్తగా పెళ్లైన జంటల్లో ఈ ఉత్సాహం మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒకరిని ఒకరు ఇంప్రెస్‌ చేయాలనుకొని ఒక్కోసారి ఇబ్బందుల్లో పడుతుంటారు. ఈ విషయాన్ని ఓ యువకుడు స్వయంగా తెలుసుకున్నాడు. ఈ విషయం  ప్రస్తుతం నెట్టింట కూడా ఆసక్తి రేపుతోంది. కొంతమంది సానుభూతి వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది ఓవర్‌ చేస్తే అలాగే ఉంటుందని కామెంట్‌ చేస్తున్నారు.

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

 తమిళనాడు చెన్నైకు సమీపంలోని మైలాపూర్‌కు చెందిన అభిషేక్ అనే యువకుడికి ఇటీవలే పెళ్లయ్యింది. శుక్రవారం ఉదయం తన భార్యను తీసుకుని కారులో షికారుకు బయలు దేరాడు. అలా వారు మెరీనా బీచ్‌కు సమీపంలో కామరాజార్ సాలై ప్రాంతానికి చేరుకున్నారు.  అక్కడికి వెళ్లాక అభిషేక్‌కు తన భార్య వద్ద తన ప్రతిభను నిరూపించుకోవాలన్న కుతుహలం ఎక్కువైంది. దీంతో  తన డ్రైవింగ్ స్కిల్స్‌తో ఆమెను ఇంప్రెస్ చేద్దామనుకున్నాడు.
 
అనుకున్నదే తడవుగా తన కారును వెనక్కు తోలుతూ తన టాలెంట్‌ను ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. కొంతదూరం వరకు సాఫిగానే సాగింది. కానీ,  మరికొంత దూరం వెళ్లిన తర్వాత అనుకోకుండా అతడు ఓ కానిస్టేబుల్ కంట పడ్డాడు. రివర్స్‌ వస్తున్న కారును గమనించిన ఆ పోలీసు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కంగారు పడ్డ అతడు కానిస్టేబుల్‌ను తప్పించుకుని మరో సందులోంచి కారు పోనిచ్చి తప్పించుకున్నాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి.

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

కారు రివర్స్‌లో రావడం, కానిస్టేబుల్‌ను తప్పించుకోవడం అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దాని  ద్వారా కారు, ఓనర్ వివరాలను పోలీసులు గుర్తించారు. అభిషేక్‌కు ఫోన్ చేసి స్టేషన్ కు రావాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తన అభిషేక్‌ తన భార్య, లాయర్‌తో కలిసి స్టేషన్‌ వెళ్లాడు. అక్కడ జరిగింది పోలీసులకు వివరించాడు. తన భార్యను ఇంప్రెస్‌ చేసే ప్రయత్నంలో  చేసిందే తప్ప తప్పు చేయాలన్న ఉద్దేశం తనకు లేదని వివరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు ససేమిరా అన్నారు.  ప్రమాదకర రీతిలో డ్రైవింగ్ చేసిన నేరం కింద కేసు నమోదు చేశారు. కారుతో పాటు దాని డాక్యుమెంట్స్, లైసెన్స్ కూడా సరెండర్ చేయాలని ఆదేశించారు. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.

Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?
 

Advertisment
Advertisment
తాజా కథనాలు