BREAKING: ఇద్దరు బంగ్లా దేశీయులకు బిగ్ షాక్.. ఆ కేసులో కఠిన కారాగార శిక్ష

ఇద్దరు బంగ్లా దేశీయులకు చైనా NIA ప్రత్యేక కోర్టు రెండేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. అక్రమంగా మనుషులను రవాణా చేయడంతో పాటు తప్పుడు పత్రాలతో బ్యాంకు ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారని తేలింది. ఈ క్రమంలో రూ.11 వేలు జరిమానాతో పాటు శిక్ష విధించింది.

New Update
NIA court

NIA court

అక్రమంగా మానవులను రవాణా చేస్తున్న కేసులో ఇద్దరు బంగ్లా దేశీయులకు చెన్నైలోని NIA ప్రత్యేక కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. షాహబుద్దీన్ హుస్సేన్, మున్నా అలియాస్ నూర్ కరీంలు అక్రమంగా మానవ రవాణా చేసినట్లు తేలడంతో కోర్టు వీరికి రెండేళ్ల పాటు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.11,000 జరిమానా కూడా విధించింది.

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..

ఇది కూడా చూడండి: Tapan Deka:  ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు

బ్యాంకు ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారని..

ఇద్దరూ కూడా బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లాకి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వీరు ఆధార్, పాన్ కార్డు వంటి నకిలీ పత్రాలను ఉపయోగించి దేశంలో అక్రమంగా ఉన్నట్లు NIA దర్యాప్తులో తేలింది. నకిలీ పత్రాల ద్వారా బ్యాంకు ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారు. అక్రమంగా భారత్‌కు మనుషులను తీసుకొచ్చి వారితో బలవంతంగా దోపిడీ చేయించినట్లు తేలడంతో NIA ప్రత్యేక కోర్టు వీరికి శిక్ష విధించింది. 

ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు