Pashamylaram Fire Accident: పాశమైలారం ఘటనలో 33కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. ఈ మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొన్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. ఈ మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొన్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలను దర్శించుకుని తిరిగివస్తున్న టెంపోట్రావెలర్‌ను కంటెయినర్ లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోగా12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
మంచిర్యాలలో సంతూర్ సోప్‌లతో వెళ్తున్న ఒక లారీ ఇంకో లారీని ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందులోని సబ్బులు రోడ్డు మీద పడటంతో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. బాధితుల కోసం కాకుండా సంతూర్ సబ్బుల కోసం ఎగబడ్డారని కొందరు మండిపడుతున్నారు.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. దోమలపెంట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ఘటనలో పలువురు భక్తులకు స్వల్ప గాయాలు కాగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఖర్వాయి గ్రామంలో జరిగిన బరాత్‌తో నృత్యం చేస్తున్న మహిళలు, పిల్లలను అదుపు తప్పిన ఎకో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన కారు స్కూటర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లేలాండ్ వాహనాన్ని గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. మహబూబాబాద్ -కేసముద్రం ప్రధాన రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
హీరో నిఖిల్ ది ఇండియన్ హౌస్ సినిమాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వ్యాటర్ ట్యాకం పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. ఈ ఘటనలో కెమెరామెన్ కు తీవ్రగాయాలయ్యాయి. మరికొంత మంది కూడా గాయపడ్డట్టు సమాచారం.