Accident: రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు?

రంగారెడ్డిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన కారు స్కూటర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

New Update
Accident

Accident

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు స్కూటర్‌ను ఢీ కొట్టడంతో గాల్లోకి ఎగిరిపడింది. దీంతో ఆ స్కూటీపై ఉన్న ముగ్గురిలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు కావడంతో పోలీసులు వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా

ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మర్రిగూడెం పంచాయతీ పరిధిలోని ఎల్లాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన ఘోర విద్యుత్ ప్రమాదం ఒక కుటుంబాన్ని నిరాశ్రయంగా మార్చేసింది. వ్యవసాయం ఆధారంగా జీవించుతున్న నర్సయ్య అనే రైతు తన ఇంటి ఎదురుగా ఉన్న బట్టల దండాన్ని తాకగా ప్రమాదవశాత్తు దానికి ఆనుకున్న సర్వీసు వైర్‌ ద్వారా విద్యుత్‌ ప్రవహించడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. తన తండ్రి నర్సయ్య కేకలు వేస్తూ పడిపోతున్నాడు అని గమనించిన కుమారుడు ప్రవీణ్‌ (30) పరుగెత్తుతూ అక్కడికి చేరి సహాయం చేయబోయాడు. కానీ.. అదే వైర్‌ను తాకడంతో అతనికీ విద్యుత్‌ షాక్‌ తగిలి నర్సయ్య మాదిరిగానే కిందపడిపోయాడు.

ఇది కూడా చూడండి: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిన ట్రంప్.. నష్టం ఎవరికంటే..?

ప్రాణం తీసిన సర్వీసు వైర్‌

ఈ ఘోర సంఘటనను చూశిన తల్లి ఎర్రమ్మ తాళం విడిచి తండ్రీ కొడుకును కాపాడేందుకు పరుగెత్తి వెళ్లింది. అయితే ఆమెకు కూడా  విద్యుత్‌ షాక్‌కు గురైంది. తండ్రి, కొడుకు చేతిలో చచ్చిపోతుండగా తల్లి కూడా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే నిష్క్రియమైంది. వీరి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే పరుగెత్తి వచ్చి పరిస్థితిని గమనించారు. వారు మూడింటికీ విద్యుత్ సరఫరాను నిలిపి పడిపడ్డ వారికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే నర్సయ్య, ప్రవీణ్‌ మరణించగా.. తీవ్రంగా గాయపడిన ఎర్రమ్మను హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు సమాచారం.

ఇది కూడా చూడండి: Mani Ratnam: 'తుగ్ లైఫ్' పరాజయంపై మొదటి సారి స్పందించిన మణిరత్నం!

 

ఇది కూడా చూడండి: Turnip: టర్నిప్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం.. ఇటా తిన్నారంటే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు