TG Crime: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఏడుగురికి గాయాలు.

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్‌ లేలాండ్‌ వాహనాన్ని గ్రానైట్‌ లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు.  మహబూబాబాద్ -కేసముద్రం ప్రధాన రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

New Update
Road Accident

Road Accident

TG Crime:మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్‌ లేలాండ్‌ వాహనాన్ని గ్రానైట్‌ లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు.  మహబూబాబాద్ -కేసముద్రం ప్రధాన రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. నెల్లికుదుర్ మండలం మీట్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని పంతులు తండాకు చెందిన వీరంతా ఇల్లందు సమీపంలోని మిర్యాలపెంట గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి అశోక్‌ లేలాండ్‌ వాహనంలో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి:చెరకు రసంలో నల్ల ఉప్పు కలిపి తాగితే ప్రయోజనాలు తెలుసా..?

ఇల్లందు నుంచి తిరిగి వస్తున్న క్రమంలో మహబూబాబాద్ మండలం వేం నూరు గ్రామ శివారు నేతాజీ తండా వద్దకు రాగానే వేగంగా వచ్చిన గ్రానైట్ లారీ వీరి వాహనాన్ని ఢీ కొట్టింది.ఈ  ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుగులోత్ రాజు అనే వ్యక్తి మృతి చెందాడు.  ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో మృతుడి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: అర్జున్ బార్క్ టీ తాగడం వల్ల ఏమవుతుంది? తప్పక తెలుసుకోండి

Advertisment
తాజా కథనాలు