🔴Live News: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
IPLలో మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూ సంచలనం రేపుతోంది. ఏప్రిల్ 19న LSGతో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఉద్దేశపూర్వకంగానే ఓడిందంటూ RCA అడ్ హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేతులెత్తేసింది. 199 టార్గెట్ ను ఛేదించలేక చతికిల పడింది. నిర్దేశించిన 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ జట్టు 39 పరుగుల తేడాతో విజయాన్ని తనఖాతాలో వేసుకుంది.
గుజరాత్‌తో మ్యాచ్‌లో కెకెఆర్ ఛేజింగ్‌కు దిగింది. తాజాగా 10 ఓవర్ల ఆట పూర్తయింది. ఈ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి కెకెఆర్ జట్టు 68 పరుగులు చేసింది. క్రీజ్‌లో వెంకటేశ్ అయ్యర్ (11), రహానె (33) పరుగులతో ఉన్నారు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ కంప్లీట్ అయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో కెకెఆర్ ముందు 199 టార్గెట్ ఉంది.
కోల్‌కతాతో మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ 15 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. 1 వికెట్ నష్టానికి 139 పరుగులు చేశారు. ఓపెనర్ సుదర్శన్ 52 పరుగులతో ఔటయ్యాడు. క్రీజ్‌లో గిల్ (61*), జోష్ బట్లర్ (22*) ఉన్నారు.
గుజరాత్ vs కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ చేస్తున్న గుజరాత్ జట్టు 10 ఓవర్లలో 0 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజ్‌లో గిల్ (49*), సుదర్శన్ (36*) ఉన్నారు.
BCCI 2025 సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. నలుగురు రోహిత్, విరాట్, బుమ్రా, జడేజను A ప్లస్ కేటగిరీలో ఉంచింది. పాటిదార్, నితీష్ కుమార్, హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి మొదటిసారిగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నారు.
తెలుగు అథ్లెట్ కోచ్ నాగపురి రమేష్‌ను ‘నాడా’ సస్పెండ్ చేసింది. జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు డోపింగ్ పరీక్షకోసం బ్లడ్ షాపింల్స్ ఇవ్వాలని ‘నాడా’ కోరింది. కానీ ఏడుగురు అథ్లెట్లు ఈ పరీక్షకు హాజరుకాకపోవడంతో చర్యలు మొదలుపెట్టింది.