Jwala Gutta : పండంటి పాపకు జన్మనిచ్చిన స్టార్‌ క్రీడాకారిణి గుత్తాజ్వాల!

స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తాజ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ తమ అభిమానులతో ఓ సంతోషకరమైన వార్తను పంచుకున్నారు.తమ నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే తమ జీవితాల్లోకి పండంటి ఆడబిడ్డ వచ్చినట్లు తెలిపారు.

New Update
jwala

jwala

స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తాజ్వాల , తమిళ నటుడు విష్ణు విశాల్‌ తమ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తాము తల్లిదండ్రులైనట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. గుత్తా జ్వాలా పండంటి ఆడబిడ్డకు  జన్మనిచ్చినట్లు విష్ణు విశాల్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఇవాళ తమ 4వ వివాహ వార్షికోత్సవం అని తెలిపారు. ఇదే రోజు తమకు ఆ దేవుడు బహుమతిగా పాపను ఇచ్చాడని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Also Read: Ex Dgp Murder Case: గూగుల్‌ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

Jwala Gutta Blessed Baby Girl

Also Read: Maoist: ఆపరేషన్ కర్రెగుట్ట.. మావోయిస్టులను చుట్టుముట్టిన భద్రతాబలగాలు.. భీకర యుద్ధం!

‘మాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్‌ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. ఈ రోజు మా 4వ వివాహ వార్షికోత్సవం. అదే రోజున మేము ఆ భగవంతుడి నుంచి ఈ బహుమతిని అందుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ సోషల్‌ మీడియాలో తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ, క్రీడా ప్రముఖులు గుత్తా జ్వాలా- విష్ణు విశాల్‌ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

2005లో చేతన్‌ ఆనంద్‌ ని ప్రేమించి పెళ్లాడిన గుత్తాజ్వాల 2011లో విడిపోయారు. అప్పటినుంచి కెరీర్‌ పైనే దృష్టిపెట్టిన గుత్తా ఆ తర్వాత తమిళ హీరో విష్ణువిశాల్‌ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెద్ద అంగీకారంతో 2021 ఏప్రిల్‌ 22న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌తో 2011లో విష్ణు విశాల్‌ పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు ఆర్యన్‌ ఉన్నాడు. ప్రస్తుతం ఆర్యన్‌ విష్ణు విశాల్‌ దగ్గరే పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: TG Crime: కూతురు కాళ్లు పట్టుకుంటే తల్లి పీక పిసికింది.. భార్య చేతిలో బలైన మరో భర్త!

Also Read: Mumbai:మీ నాన్న లాగే నిన్ను కూడా చంపేస్తాం..బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు!

 jwala gutta | vishnu vishal | badmiton | baby-girl | sports | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు