RR vs LSG: IPLలో మ్యాచ్ ఫిక్సింగ్.. కావాలనే ఓడిన రాజస్థాన్?

IPLలో మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూ సంచలనం రేపుతోంది. ఏప్రిల్ 19న LSGతో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఉద్దేశపూర్వకంగానే ఓడిందంటూ RCA అడ్ హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 

New Update
rr lsg

IPL 2025 Rajasthan Royals Accused Of Match Fixing

IPL: ఐపీఎల్ టోర్నీలో మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ సంచలనం రేపుతోంది. ఏప్రిల్ 19న LSGతో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఉద్దేశపూర్వకంగానే ఓడిందంటూ RCA అడ్ హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. దీనిపై వెంటనే వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 

Also Read :  ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!

అనూహ్య ఓటమి..

ఈ మేరకు శనివారం రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరగగా 2 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమి పాలైంది. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో రాజస్థాన్ ఒక దశలో దూసుకుపోతున్నట్లు కనిపించింది. కానీ అనూహ్యంగా చివరి ఓవర్లలో పరుగులు చేయకపోవడం అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. ఈ ఫలితంపై రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సిఎ) అడ్ హాక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆర్ఆర్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు లేవనెత్తారు. డెత్ ఓవర్లలో కావాలనే రన్స్ కొట్టలేదని, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని బలంగా వాదిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

'రాజస్థాన్ లో రాష్ట్ర ప్రభుత్వం అడ్ హాక్ కమిటీని నియమించింది. అన్ని పోటీల్లో ఎలాంటి సమస్యలు లేకుండా జరిగేలా మేము చూసుకుంటాం. కానీ IPLలో అలా జరగడం లేదు. మా ప్రమేయం లేకుండానే మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు' అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఇక బిహానీ కొంతకాలంగా రాజస్థాన్ రాయల్స్‌ క్రికెట్ వ్యవహారాలకు వ్యతిరేకంగా తన వాయిస్ వినిపిస్తున్నాడు. రాష్ట్ర సంఘం తాత్కాలిక కమిటీని రాజస్థాన్ రాయల్స్ IPL వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలనే స్పోర్ట్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించడం కూడా చర్చనీయాంశమైంది.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

Also Read :  Saudi Arabia: వెంటనే ఆపేయండి.. ఇజ్రాయెల్‌కు వార్నింగ్‌ ఇచ్చిన సౌదీ

 

IPL Match Fixing | Rajastan Royals | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు