/rtv/media/media_files/2025/01/14/QcCZNY5SNbO5poawbLc9.jpg)
BCCI central contracts 2025 list release
BREAKING: BCCI 2025 సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. కేవలం నలుగురు ఆటగాళ్లు రోహిత్, విరాట్, బుమ్రా, జడేజాలను A ప్లస్ కేటగిరీలో ఉంచింది. పాటిదార్, నితీష్ కుమార్, హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి మొదటిసారిగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నారు.
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
— BCCI (@BCCI) April 21, 2025
BCCI announces annual player retainership 2024-25 - Team India (Senior Men)#TeamIndia
Details 🔽https://t.co/lMjl2Ici3P pic.twitter.com/CsJHaLSeho
A+ కేటగిరీలో నలుగురే..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2024-25 సీజన్ అగ్రిమెంట్ లిస్ట్ ప్రకటించింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలను ఎ ప్లస్ కేటగిరీలోనే ఉంచారు. 2023, -24 జాబితాలో చోటు దక్కని శ్రేయాస్ అయ్యర్ B, ఇషాన్ కిషన్ ను C కేటగిరిలో చేరారు. రజత్ పాటిదార్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి మొదటిసారిగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లను అందుకోగా వీరిని కేటగిరీ Cలో చేర్చారు.
Wicketkeeper-batter Rishabh Pant upgraded to A category. Shreyas Iyer returns to list of contracted players in B category
— Press Trust of India (@PTI_News) April 21, 2025
రోహిత్, కోహ్లీ, జడేజా T20 నుంచి రిటైర్ అయిన తర్వాత వారిని A+ కేటగిరీ (రూ. 7 కోట్ల వార్షిక జీతం) నుంచి తొలగించనున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. కానీ బోర్డు ఆ ముగ్గురిని ఏ లోనే కొనసాగిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. అయ్యర్ గ్రేడ్ B కేటగిరీకి తిరిగి రాగా, ఇషాన్ గ్రేడ్ C బ్రాకెట్‌లోకి చేర్చబడ్డాడు. వికెట్ కీపర్-, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను కేటగిరీ A కి అప్‌గ్రేడ్ చేశారు.
Rohit Sharma, Virat Kohli, Jasprit Bumrah and Ravindra Jadeja retained in A+ category of BCCI central contracts
— Press Trust of India (@PTI_News) April 21, 2025
సెంట్రల్ కాంట్రాక్ట్ జీతం:
1. A+ ప్లస్ కేటగిరీ: రూ. 7 కోట్లు
2. కేటగిరీ A: రూ. 5 కోట్లు
3. గ్రేడ్ B: రూ. 3 కోట్లు
4. గ్రేడ్ C: రూ. 1 కోటి.
telugu-news