GT vs KKR: చెండాడేసిన గుజరాత్.. కెకెఆర్ ముందు 199 టార్గెట్ - ఎవరి స్కోర్ ఎంతంటే?

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ కంప్లీట్ అయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో కెకెఆర్ ముందు 199 టార్గెట్ ఉంది. 

New Update
GT vs KKR gill match


కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ కంప్లీట్ అయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో కెకెఆర్ ముందు 199 టార్గెట్ ఉంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ గిల్ అదరగొట్టేశాడు. 90 పరుగులతో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. 

Also Read :  ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !

టాస్ ఓడి బ్యాటింగ్‌కు

ఐపీఎల్ 2025 సీజన్ హోరా హోరీగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్ కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కెకెఆర్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ క్రీజ్‌లోకి వచ్చారు. మొదటి నుంచి దూకుడుగా ఆడారు. తొలి 2 ఓవర్లకు 12 పరుగుల స్కోర్ చేశారు. ఇద్దరూ నిలకడగా దుమ్ము దులిపేశారు. 

Also Read :  కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

ఒక్క వికెట్ పడకుండా పరుగుల వరద పెట్టించారు. కెకెఆర్ బౌలర్లకు చెమటలు పట్టించారు. ఇలా 5 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 38 పరుగులు చేశారు. ఓవైపు సుదర్శన్, మరోవైపు గిల్ ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయారు. గుజరాత్ జట్టు 10 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. 

Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!

తొలి ఇన్నింగ్స్‌లో గుజరాత్ అదరగొట్టేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెలరేగిపోయాడు. ఓపెనర్లు ఇద్దరూ నిలకడగా ఆడుతున్న సమయంలో సాయి సుదర్శన్  ఔట్ అయ్యాడు. 36 బంతుల్లో 52 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.  ఆ తర్వాత జోస్ బట్లర్‌ క్రీజ్‌లోకి వచ్చి చెండాడేశాడు. దీంతో 15 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 139 పరుగులు సాధించారు. జోష్ బట్లర్ దూకుడుతో పరుగులే పరుగులు వచ్చాయి. 

Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?

ఇక సెంచరీకి దగ్గరలో ఉన్న గిల్‌కు ఒక్కసారిగా షాక్ తగిలింది. వైభవ్ అరోరా వేసిన 18 ఓవర్‌లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి 90 పరుగులకు చేరుకున్న గిల్ ఆ తర్వాత ఔటయ్యాడు. 55 బంతుల్లో 90 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో గుజరాత్ 2వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రాహుల్ తెవాతియా డకౌటయ్యాడు. జోస్ బట్లర్ 23 బంతుల్లో  41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.  ఇలా 3 వికెట్ల తేడాతో గుజరాత్ జట్టు 198 పరుగులు చేసింది. 

IPL 2025 | GT vs KKR

Advertisment
తాజా కథనాలు