GT vs KKR: చేజారిపోతున్న మ్యాచ్.. కట్టడి చేస్తున్న గుజరాత్ బౌలర్లు - కెకెఆర్ 10 ఓవర్ల స్కోర్ ఎంతంటే?

గుజరాత్‌తో మ్యాచ్‌లో కెకెఆర్ ఛేజింగ్‌కు దిగింది. తాజాగా 10 ఓవర్ల ఆట పూర్తయింది. ఈ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి కెకెఆర్ జట్టు 68 పరుగులు చేసింది. క్రీజ్‌లో వెంకటేశ్ అయ్యర్ (11), రహానె (33) పరుగులతో ఉన్నారు.

New Update
gt vs kkr...

గుజరాత్‌తో మ్యాచ్‌లో కెకెఆర్ ఛేజింగ్‌కు దిగింది. తాజాగా 10 ఓవర్ల ఆట పూర్తయింది. ఈ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి కెకెఆర్ జట్టు  పరుగులు చేసింది. క్రీజ్‌లో వెంకటేశ్ అయ్యర్ (11), రహానె (33)  పరుగులతో ఉన్నారు. 

ఛేజారిపోతున్న మ్యాచ్

గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు కెకెఆర్ జట్టు క్రీజ్‌లోకి దిగింది. ఓపెనర్లుగా గుర్బాజ్‌, నరైన్‌ అడుగుపెట్టారు. మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఆ దుకుడు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి ఓవర్‌లోనే కోల్‌కతాకు షాక్‌ తగిలింది. గుర్బాజ్‌ ఔట్‌ అయ్యాడు. 0.5 ఓవర్‌లో గుర్బాజ్‌ ఎల్బీడబ్ల్యూతో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి కెప్టెన్ రహానే వచ్చాడు. కానీ గుజరాత్ జట్టు మాత్రం కట్టుదిట్టంగా బంతులేస్తుంది. 

భారీ షాట్లు కొట్టనివ్వకుండా చేస్తుంది. ఇలా ఐదు ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి కేకేఆర్‌ 1వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. మెల్లి మెల్లిగా స్కోర్ వస్తుందనుకున్న సమయంలో కోల్‌కతా రెండో వికెట్‌ కోల్పోయింది. నరైన్‌ (17) ఔట్‌ అయ్యాడు. రాహుల్ తెవాతియాకు క్యాచ్ ఇచ్చి నరైన్ వెనుదిరిగాడు. అనంతరం వెంకటేశ్‌ అయ్యర్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు కెప్టెన్ రహాన, వైస్ కెప్టెన్ వెంకటేష్ అయ్యార్ క్రీజ్‌లో ఉన్నారు. 

IPL 2025 | latest-telugu-news | GT vs KKR

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు