GT vs KKR: దంచికొడుతున్న గుజరాత్ ఓపెనర్లు.. 10 ఓవర్ల స్కోర్ ఎంతంటే?

గుజరాత్ vs కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ చేస్తున్న గుజరాత్ జట్టు 10 ఓవర్లలో 0 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజ్‌లో గిల్ (49*), సుదర్శన్ (36*) ఉన్నారు.

New Update
GT vs KKR

GT vs KKR Photograph: (GT vs KKR)

ఐపీఎల్ 2025 సీజన్ హోరా హోరీగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్ కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెకెఆర్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ క్రీజ్‌లోకి వచ్చారు. మొదటి నుంచి దూకుడుగా ఆడుతున్నారు. తొలి 2 ఓవర్లకు 12 పరుగుల స్కోర్ చేశారు. 

బాదేస్తున్న ఓపెనర్లు 

ఇద్దరూ నిలకడగా దుమ్ము దులిపేస్తున్నారు. ఒక్క వికెట్ పడకుండా పరుగుల వరద పెట్టిస్తున్నారు. కెకెఆర్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నారు. ఇలా 5 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 38 పరుగులు చేశారు. ఓవైపు సుదర్శన్, మరోవైపు గిల్ ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోతున్నారు. తాజాగా గుజరాత్ జట్టు 10 ఓవర్లు పూర్తి చేసుకుంది. ఈ 10 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో గిల్ (49*), సుదర్శన్ (36*) ఉన్నారు.

IPL 2025 | latest-telugu-news | telugu-news | GT vs KKR

Advertisment
Advertisment