/rtv/media/media_files/2025/04/21/ml9JaZZdg7FmDsbnLrhw.jpg)
kkr vs gt
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేతులెత్తేసింది. 199 టార్గెట్ ను ఛేదించలేక చతికిల పడింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ జట్టు 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది.
Also Read : ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !
ఛేదనలో చేతులెత్తేసిన కేకేఆర్
గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు కెకెఆర్ జట్టు క్రీజ్‌లోకి దిగింది. ఓపెనర్లుగా గుర్బాజ్, నరైన్ అడుగుపెట్టారు. మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఆ దుకుడు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి ఓవర్‌లోనే కోల్‌కతాకు షాక్ తగిలింది. గుర్బాజ్ ఔట్ అయ్యాడు. 0.5 ఓవర్‌లో గుర్బాజ్ ఎల్బీడబ్ల్యూతో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి కెప్టెన్ రహానే వచ్చాడు. కానీ గుజరాత్ జట్టు మాత్రం కట్టుదిట్టంగా బంతులేస్తుంది.
Also Read : కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!
భారీ షాట్లు కొట్టనివ్వకుండా చేస్తుంది. ఇలా ఐదు ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి కేకేఆర్ 1వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. మెల్లి మెల్లిగా స్కోర్ వస్తుందనుకున్న సమయంలో కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. నరైన్ (17) ఔట్ అయ్యాడు. రాహుల్ తెవాతియాకు క్యాచ్ ఇచ్చి నరైన్ వెనుదిరిగాడు. అనంతరం వెంకటేశ్ అయ్యర్ క్రీజ్‌లోకి వచ్చాడు.
కొంత వరకు రహానె, వెంకటేష్ అయ్యార్ పరుగులు రాబట్టారు. కానీ ప్రెజర్‌లోకి వెళ్లడంతో వారు కూడా చేతులెత్తేశారు. వెంకటేశ్ అయ్యర్ (14) వెనుదిరిగాడు. 84 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. తర్వాత రస్సెల్ వచ్చి వరుసగా 4, 6 బాదాడు. కానీ అతడు కూడా ఎక్కువ సమయం ఆడలేకపోయాడు. కేవలం 21 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో 13 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 101 పరుగులు సాధించారు.
Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!
అజింక్య రహానె 36 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రమణ్‌దీప్ సింగ్ (1), మొయిన్ అలీ డకౌట్, రింకు సింగ్ (17) ఇలా వరుసగా అందరూ చేతులెత్తేయడంతో కేకేఆర్ జట్టు ఓటమి పాలైంది. ఈ జట్టులో కెప్టెన్ అజింక్య రహానె (50) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, సాయి కిశోర్, ఇషాంత్ శర్మ ఒక్కో వికెట్ తీశారు.
IPL 2025 | GT vs KKR | subhman-gill | latest-telugu-news | telugu-news | KKR vs GT