/rtv/media/media_files/2025/04/21/nuR4ymyaC6SbZy67N4bh.jpg)
Telugu athlete coach Nagpuri Ramesh suspended by NADA
Athletes drugs case: అంతర్జాతీయ స్థాయిలో అథ్లెట్లను తీర్చిదిద్దిన కోచ్ నాగపురి రమేష్‌ను ‘నాడా’ సస్పెండ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది గొప్ప ప్లేయర్లను తయారు చేసిన ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేష్ తో పాటు సహాయ కోచ్‌లు కరంవీర్ సింగ్, రాకేష్‌పై కూడా 'జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ' వేటు వేసింది. నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ జట్టు చీఫ్ కోచ్‌గా హైదరాబాద్‌లోని ‘సాయ్’ సెంటర్ లో రమేష్ 2023 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అయితే 2024 అక్టోబరు నుంచి ఇటీవల జరిగిన పలు జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన కొందరు క్రీడాకారులు డోపింగ్ పరీక్షలకోసం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని ‘నాడా’ లిస్ట్ తయారు చేసింది. కానీ ఇందులో ఏడుగురు అథ్లెట్లు ఈ పరీక్షలకు హాజరుకాకపోవడం పలు అనుమానాలకు దారితీసింది.
ఆర్టికల్ 2.3 నిబంధన ప్రకారం నేరం..
తెలుగు అథ్లెట్స్ సీహెచ్ ప్రత్యూష, షణ్ముగ శ్రీనివాస్, శుభుం మహార, పరాస్ సింఘాల్, పూజా రాణి, కిరణ్, జ్యోతి రక్త నమూనాలు ఇవ్వలేదు. దీంతో ఆర్టికల్ 2.3 నిబంధన ప్రకారం వీరందని సస్పెండ్ చేసింది. రమేష్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న శ్రీనివాస్, ప్రత్యూషకు డోప్ పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్‌లోని ‘సాయ్’ సెంటర్‌కు నాడా వైద్యుల బృందం వచ్చింది. ఈ విషయం తెలియగానే అక్కడ నుంచి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు. దీంతో ఆర్టికల్ 2.9 ప్రకారం కోచ్ రమేష్‌పై వేటు పడింది. డోపింగ్‌ను ప్రోత్సహించడం, సహకరించడం వంటి కుట్రలకు పాల్పడిన కోచ్ లు శిక్షార్హులే. దీంతో 2023లో శ్రీనివాస్ సహా మరో ఐదుగురు అథ్లెట్లు డోపింగ్ ఆరోపణలతో వేటుకు గురయ్యారు. అయితే ఇటీవల వారిపై నిషేధం ముగియడంతో పలు పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇది కూడా చూడండి: 10th Class Students: ఆన్సర్ షీట్లో రూ.500.. ఛాయ్ తాగి నన్ను పాస్ చేయండి - 10th క్లాస్ స్టూడెంట్స్ అరాచకం
మరోవైపు డోపింగ్ చేసినట్లు తేలితే రమేష్ ‘నాడా’ నిబంధనల ప్రకారం 2 నుంచి జీవితకాలం నిషేధం ఎదుర్కొన్నే అవకాశం ఉంది. జకర్తా ఆసియా క్రీడల పతాకధారి ద్యూతీ చంద్, పారిస్ పారాలింపిక్స్ మెడలిస్ట్ జీవాంజి దీప్తి, హాంగ్జౌ ఆసియా క్రీడల కాంస్య పతక విజేత అగసర నందిని, పారిస్ ఒలింపియన్ యర్రాజీ జ్యోతి, దండి జ్యోతికశ్రీ వంటి ఎంతోమంది గొప్ప క్రీడాకారులను తీర్చిదిద్దిన రమేష్ కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వివాదంపై జాతీయ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (AIF) స్పందించేందుకు నిరాకరించింది. నాడా నిబంధనల ప్రకారం నడుచుకుంటుందని స్పష్టం చేసింది. కానీ తాను ఏ తప్పు చేయలేదని, తప్పు చేసే వారిని ప్రోత్సహించనని రమేష్ చెబుతున్నాడు. పేద అథ్లెట్లను తీర్చిదిద్దడానికే నా జీవితాంతం కృషి చేశానని, ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
ఇది కూడా చూడండి: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్
దేశంలోని AFIతో పాటు 'నాడా' సైతం డోపింగ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. అథ్లెట్లతో పాటు కోచ్‌ల వివరాల నమోదు రూల్స్ తప్పనిసరి చేశాయి. కోచ్ వివరాలను తమకు తప్పకుండా ఇవ్వాలని అథ్లెట్లకు మార్గదర్శకాలు రిలీజ్ చేశాయి. ఇవ్వని వారిని ఏఎఫ్‌ఐ బ్లాక్‌లిస్ట్‌లో పెడుతోంది. ఢిల్లీ పోలీసు స్పెషల్ కమిషనర్ సాగర్‌ప్రీత్ హూడా నేతృత్వంలో హైపవర్ కమిటీని AFI ఏర్పాటు చేయగా డోపింగ్ పై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
indian-athlete | coach | telugu-news | today telugu news