IND vs AUS : పోరాడి ఓడిన భారత్.. స్మృతి మంధాన సెంచరీ వృథా!
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది.413 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు 369 పరుగులకు ఆలౌటయ్యింది. దీంతో 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది.413 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు 369 పరుగులకు ఆలౌటయ్యింది. దీంతో 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
స్మృతి మంధానా తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ, వన్డే క్రికెట్లో ఒక అరుదైన రికార్డును నెలకొల్పింది. పురుషులు, మహిళల క్రికెట్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ సాధించిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డును మంధాన బద్దలు కొట్టింది.
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్‌కి జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ మళ్లీ మ్యాచ్ రెఫరీగా వ్యవహరించనున్నారు. ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తన వైఖరిని స్పష్టం చేసింది.
భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో గులాబీ రంగు జెర్సీలు ధరించింది. రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం అని BCCI పేర్కొంది. దీనికి సంబంధించిన పోస్ట్‌ను సోషల్ మీడియాలో సేర్ చేసింది.
ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 లో రేపు పాకిస్థాన్‌తో టీమిండియా ఆడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కు గాయమైంది. ఒమాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతని తలకు గాయమైంది.
ఆసియా కప్ 2025లో భాగంగా శుక్రవారం భారత్, ఒమన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగులతో ఘన విజయం సాధించింది. అయితే ఒమన్ జట్టు ఓటమి పాలైనా కూడా ప్రదర్శన పరంగా ఏ మాత్రం తగ్గలేదని, ఆకట్టుకుందని టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రశంసించారు.
పసికూన ఒమన్ పై చెమటోడ్చి మ్యాచ్ గెలిచింది టీమ్ ఇండియా. ఆసియా కప్ లో ఈరోజు జరిగిన నామమాత్తరపు మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో భారత జట్టు నెగ్గింది.