Smriti Mandhana : వారేవా.. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన స్మృతి మంధానా

స్మృతి మంధానా తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ, వన్డే క్రికెట్‌లో ఒక అరుదైన రికార్డును నెలకొల్పింది. పురుషులు, మహిళల క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ సాధించిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డును మంధాన బద్దలు కొట్టింది.

New Update
mandana

భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధానా(smriti-mandhana) తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ, వన్డే క్రికెట్‌లో ఒక అరుదైన రికార్డును నెలకొల్పింది. పురుషులు, మహిళల క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ సాధించిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డును మంధాన బద్దలు కొట్టింది. ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో స్మృతి మంధాన కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించి ఈ ఘనత సాధించారు. 

Also Read :New Smartphone: AI కెమెరా, 6,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్ సూపరెహే.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔటే..!

అంతకుముందు, భారత పురుషుల, మహిళల క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ రికార్డు విరాట్ కోహ్లీ(Virat Kohli) పేరిట ఉండేది. కోహ్లీ 2013లో ఆస్ట్రేలియాపై 52 బంతుల్లో సెంచరీ చేశారు. ఇప్పుడు మంధాన ఆ రికార్డును అధిగమించారు. మంధానా సెంచరీ మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీగా నిలిచింది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ (45 బంతుల్లో) ఉన్నారు.

డూ ఆర్ డై మ్యాచ్ 

మంధానా అంతకుముందు భారత మహిళల తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును (70 బంతుల్లో) కూడా తన పేరిటే కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆమె తన రికార్డును తానే మెరుగుపరుచుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు 413 పరుగులు చేయగా, దాన్ని ఛేదించే క్రమంలో మంధానా 17 ఫోర్లు, 5 సిక్సులతో 125 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్‌కు పటిష్టమైన పునాది వేశారు. ఈ సెంచరీతో ఆమె తన అసాధారణమైన ఫామ్‌ను మరోసారి నిరూపించుకున్నారు. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా 1-1తో సమంగా ఉన్నాయి. ఇది ఇరు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్ 

Also Read :H-1B వీసాలపై ట్రంప్ నిర్ణయంతో తెలంగాణకు ఎంత నష్టమంటే?: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన!

మహిళల వన్డేల్లో వేగవంతమైన సెంచరీలు

45 - మెగ్ లానింగ్ vs NZ-W, నార్త్ సిడ్నీ ఓవల్, 2012
50 - స్మృతి మంధాన vs AUS-W, ఢిల్లీ, 2025
57 - కరెన్ రోల్టన్ vs SA-W, లింకన్, 2000
57 - బెత్ మూనీ vs IND-W, ఢిల్లీ, 2025
59 - సోఫీ డివైన్ vs IRE-W, డబ్లిన్, 2018
60 - చమరి అతపత్తు vs NZ-W, గాలె, 2023 

Also Read : IND vs PAK : పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. సూపర్ ఫోర్ మ్యాచ్‌కు కూడా అతనే

Advertisment
తాజా కథనాలు