Asia Cup 2025: మ్యాచ్‌కి హైలెట్ అతనే.. ఒమన్‌పై ప్రశంసంల జల్లు కురిపించిన టీమిండియా కెప్టెన్ స్కై!

ఆసియా కప్ 2025లో భాగంగా శుక్రవారం భారత్, ఒమన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగులతో ఘన విజయం సాధించింది. అయితే ఒమన్ జట్టు ఓటమి పాలైనా కూడా ప్రదర్శన పరంగా ఏ మాత్రం తగ్గలేదని, ఆకట్టుకుందని టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రశంసించారు.

New Update
Surya Kumar yadav

Surya Kumar yadav

ఆసియా కప్ 2025లో భాగంగా శుక్రవారం భారత్, ఒమన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగులతో ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ గెలిచింది టీమిండియా అని, కానీ మనస్సులు గెలిచింది మాత్రం ఒమన్ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఒమన్ జట్టు ఓటమి పాలైనా కూడా ప్రదర్శన పరంగా ఏ మాత్రం తగ్గలేదని, ఆకట్టుకుందని టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రశంసించారు. ఒమన్ కోచ్ సులక్షణ్ కురకర్ణి వల్లే ఆ జట్టు మెరుగైన ప్రదర్శన చేసిందని సూర్య కుమార్ యాదవ్ అన్నారు. ఒమన్ జట్టు అయితే బ్యాటింగ్ అదరగొట్టిందని మీడియా వేదికగా తెలియజేశారు. ఇకపై తర్వాత మ్యాచ్ నుంచి నేను కూడా 11వ స్థానంలో ఆడే ప్రయత్నం చేస్తానని సూర్య కుమార్ యాదవ్ తెలిపారు. వారి ఆట చూసి ఫిదా అయిపోయానని టీమిండియా కెప్టెన్ అన్నారు. ఒమన్ కోచ్ సులు సర్(సులక్షణ్ కులకర్ణి) గురించి తనకు తెలుసని, అతని వల్లే ఆ జట్టు బ్యాటింగ్‌లో అదరగొట్టిందని అన్నారు. వారి ఆటను చాలా బాగా ఆస్వాదించానని సూర్య కుమార్ యాదవ్ తెలిపారు. సూపర్ 4 మ్యాచ్‌లకు రెడీగా ఉన్నామని సూర్య కుమార్ అన్నారు. అయితే ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ అయితే సూపర్‌గా ఉంది. 

ఇది కూడా చూడండి: India-oman: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ..ఒమన్ టార్గెట్ 189

హాఫ్ సెంచరీతో అదరగొట్టిన..

ఈ మ్యాచ్‌లో  సంజు శాంసన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. సంజూ శాంసన్(45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26), తిలక్ వర్మ(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29) దూకుడుగా ఆడారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్(2/23), జితేన్(2/33), అమీర్ కలీమ్(2/31) రెండేసి వికెట్లు తీసారు. అనంతరం ఒమన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి ఓటమిపాలైంది.

ఇది కూడా చూడండి: India vs Oman: చెమటోడ్చిన టీమ్ ఇండియా..శభాష్ అనిపించుకున్న ఒమన్

ఒమన్ బ్యాటర్లలో అమీర్ కలీమ్(46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64), హమ్మద్ మిర్జా(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కెప్టెన్ జతిందర్ సింగ్(33 బంతుల్లో 5 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీసారు. అందరికి బ్యాటింగ్ ఇవ్వడంతో పాటు బౌలింగ్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో ఒమన్ ఓడినా స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చింది. బౌలింగ్‌లో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంతో పాటు బ్యాటింగ్‌లో భారత బౌలర్లను చెడుగుడు ఆడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఏకపక్ష విజయాలు అందుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లో కాస్త కష్టంగానే గెలిచింది.

Advertisment
తాజా కథనాలు