/rtv/media/media_files/2025/09/20/pak-vs-ind-2025-09-20-14-36-25.jpg)
ఆసియా కప్ 2025(Asia cup 2025) లో భాగంగా సూపర్ 4 లో రేపు పాకిస్థాన్(pakistan) తో టీమిండియా(team-india) ఆడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కు గాయమైంది. ఒమాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతని తలకు గాయమైంది. ఒమన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లోహమ్మద్ మీర్జా కొట్టిన షాట్‌ను క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించినప్పుడు అక్షర్ బ్యాలెన్స్ కోల్పోయి తల నేలకు గట్టిగా తాకాడు. వెంటనే అతను మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు.
Axar Patel's participation in India's Asia Cup Super Four match against Pakistan is uncertain due to a head injury he sustained during India's match against Oman.https://t.co/7Wm3X0SNBU#HardikPandya#SanjuSamson#Liberty#Gill#Drewpic.twitter.com/EkonHe8vwW
— SPORTS WIZ (@mysportswiz) September 20, 2025
Also Read : Asia Cup 2025: మ్యాచ్‌కి హైలెట్ అతనే.. ఒమన్‌పై ప్రశంసంల జల్లు కురిపించిన టీమిండియా కెప్టెన్ స్కై!
దిలీప్ మాట్లాడుతూ
అయితే మ్యాచ్ అనంతరం భారత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ మాట్లాడుతూ అక్షర్ పటేల్ ప్రస్తుతానాకి బాగానే ఉన్నారని, అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటంపై ఇంకా స్పష్టత లేదని వెల్లడించాడు. ఈ గాయం కారణంగా అక్షర్ పాకిస్థాన్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై సందేహంగా మారింది. ఒకవేళ అతను ఆడలేకపోతే, అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
గతంలో, పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌కు ముందు శుభ్‌మన్ గిల్‌కు కూడా ప్రాక్టీస్ సమయంలో చేతికి గాయమైంది. అయితే, అతను వెంటనే కోలుకుని మ్యాచ్ ఆడాడు. కాగా ఇప్పటికే గ్రూప్ దశలో భారత్, పాకిస్థాన్‌లను ఓడించి సూపర్-4కు చేరింది.
21 పరుగులతో ఘన విజయం
ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. సంజూ శాంసన్(45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26), తిలక్ వర్మ(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29) దూకుడుగా ఆడారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్(2/23), జితేన్(2/33), అమీర్ కలీమ్(2/31) రెండేసి వికెట్లు తీసారు. అనంతరం ఒమన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఒమన్ బ్యాటర్లలో అమీర్ కలీమ్(46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64), హమ్మద్ మిర్జా(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కెప్టెన్ జతిందర్ సింగ్(33 బంతుల్లో 5 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.
Also Read : చెమటోడ్చిన టీమ్ ఇండియా..శభాష్ అనిపించుకున్న ఒమన్