Asia Cup 2025: నేడే బిగ్ ఫైట్.. భారత్, పాక్ మ్యాచ్.. సూపర్ 4 మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే!

ఆసియా కప్‌ 2025లో భాగంగా టోర్నీలో గ్రూప్ మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. అయితే సూపర్ 4 దశకు గ్రూప్-A నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-B నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు చేరుకున్నాయి. అయితే సూపర్ 4లో భాగంగా నేడు పాక్, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది.

New Update
Asia cup 2025

Asia cup 2025

ఆసియా కప్‌ 2025లో భాగంగా టోర్నీలో గ్రూప్ మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. అయితే సూపర్ 4 దశకు గ్రూప్-A నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-B నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు చేరుకున్నాయి. అయితే సూపర్ 4లో భాగంగా నేడు పాక్, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే సూపర్ 4లో చేరిన నాలుగు జట్లలో ఒక్కో జట్టు మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. మిగతా జట్లుతో ఒక్కో మ్యాచ్ ఆడగా.. ఏ జట్లు అయితే ఎక్కువ విజయాలు సాధిస్తాయో అవి ఫైనల్‌కు వెళ్తాయి. అయితే సూపర్ 4 సెప్టెంబర్ 20న ప్రారంభమైంది. సెప్టెంబర్ 26 వరకు మ్యాచ్‌లు జరగ్గా.. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న ఉంటుంది. ఈ సూపర్‌ 4లో భాగంగా సెప్టెంబర్ 20న శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగ్గా.. 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలిచింది.

ఇది కూడా చూడండి: Smriti Mandhana : వారేవా.. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన స్మృతి మంధానా

పూర్తి షెడ్యూల్ ఇదే..

నేడు పాకిస్తాన్, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్ చేతిలో పాక్ గ్రూప్ దశలో ఓడిపోయింది. సూపర్ 4లో అయినా మంచి ప్రదర్శన చేయాలని పాక్ భావిస్తోంది. అయితే గ్రూప్ దశలో భారత్ ఎలాంటి అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందో.. సూపర్ 4 లో కూడా అంతే బాగా ఆడాలని పట్టుదలగా ఉంది. ఇక సెప్టెంబర్ 23న పాకిస్తాన్, - శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 24 న భారత్, - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుండగా.. సెప్టెంబర్ 25 న పాకిస్తాన్, - బంగ్లాదేశ్ మధ్య జరుగుతుంది. సెప్టెంబర్ 26న భారత్, శ్రీలంక మధ్య జరుగుతుంది. అయితే వీటిలో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్లు ఫైనల్‌కు చేరుతాయి. అయితే ఈ మ్యాచ్‌లు అన్ని కూడా రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి. వీటిని సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌లో చూడవచ్చు. 

ఇది కూడా చూడండి: IND vs AUS : పోరాడి ఓడిన భారత్.. స్మృతి మంధాన సెంచరీ వృథా!

Advertisment
తాజా కథనాలు