/rtv/media/media_files/2025/09/20/oman2-2025-09-20-00-51-53.jpg)
టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. దీంతో ఒమన్ టార్గెట్ 189 పరుగులు చేయాల్సి ఉంది. టీమ్ఇండియా బ్యాటర్లలో సంజు శాంసన్ 56, అభిషేక్ శర్మ 38, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 26 రాణించారు. ఒమన్ బౌలర్లలో ఆమిర్ కలీం, షా ఫైజల్, జితెన్ రామనండి తలో రెండు వికెట్లు తీశారు.
విజృంభించిన ఒమన్ బ్యాటర్లు...
దీని తరువాత 189 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఒమన్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆమిర్ ఖలీమ్(64: 46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లు), హమద్ (51: 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లు) అర్ధశతకాలతో చెలరేగగా, జితేందర్ సింగ్ (32) రాణించాడు. 56 పరుగుల దగ్గర మొదటి వికెట్ కోల్పోయిన ఒమన్ రెండో వికెట్ కు 93 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఖలీమ్, మిర్జా క్రీజులో పాతుకుపోయి ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డారు. అయితే చివర్లో భారత బౌలర్లు సరైన బంతులు వేయడంతో ఒమన్ జట్టును 167 పరుగులకే కట్టడి చేయగలిగారు. ఒకానొక టైమ్ లో ఆ జట్టు మ్యాచ్ గెలుస్తుందని అందరూ డిసైడ్ అయిపోయారు. భారత్ బౌలర్లలో కుల్దీప్, హర్షిత్, హార్దిక్, అర్ష్ దీప్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో 8 మంది భారత ఆటగాళ్లు బౌలింగ్ చేయడం విశేషం. ఈనెల 21న ఇండియా, పాక్ లు సూపర్-4లో తలపడనున్నాయి.