IND vs AUS : పోరాడి ఓడిన భారత్.. స్మృతి మంధాన సెంచరీ వృథా!

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది.413 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు 369 పరుగులకు ఆలౌటయ్యింది. దీంతో 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

New Update
ind vs aus

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది.413 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు 369 పరుగులకు ఆలౌటయ్యింది. దీంతో 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.భారత మహిళ ఆటగాళ్లలో స్మృతి మంధాన (125; 63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో ఆకట్టుకుంది. ఇక దీప్తి శర్మ (72), హర్మన్‌ప్రీత్‌ (52) రాణించినా భారత్ కు ఓటమి తప్పలేదు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్‌ 2-1తో కైవసం చేసుకుంది.

ఇక ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 412 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో బెత్ మూనీ (138; 75 బంతుల్లో 23 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ శతకం బాదారు.  ఈ మ్యాచ్‌లో మొత్తం 781 పరుగులు నమోదయ్యాయి. కాగా ఈ మ్యాచ్ లో గ్రేస్‌ఫుల్ ఓపెనర్ స్మృతి మంధాన కేవలం 50 బంతుల్లోనే రెండవ వేగవంతమైన మహిళల వన్డే  సెంచరీ సాధించింది.2000-01లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ కరెన్ రోల్టన్ (57 బంతుల్లో) నెలకొల్పిన రికార్డును మంధాన అధిగమించింది.

మహిళల వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీలు 


45- మెగ్ లానింగ్ vs న్యూజిలాండ్, నార్త్ సిడ్నీ ఓవల్, 2012
50- స్మృతి మంధాన vs ఆస్ట్రేలియా, ఢిల్లీ, 2025*
57- కరెన్ రోల్టన్ vs దక్షిణాఫ్రికా, లింకన్, 2000
57- బెత్ మూనీ vs ఇండియా, ఢిల్లీ, 2025*
59- సోఫీ డివైన్ vs ఐర్లాండ్, డబ్లిన్, 2018
60- చమరి అటపట్టు vs న్యూజిలాండ్, గాలే, 2023

ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు (మహిళల ODI)
4 - స్మృతి మంధాన, 2024
4 - స్మృతి మంధాన, 2025
4 - తజ్మిన్ బ్రిట్స్, 2025

మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు:
15 - మెగ్ లానింగ్,
13 - సుజీ బేట్స్,
13 - స్మృతి మంధాన,
12 - టామీ బ్యూమాంట్ 

Advertisment
తాజా కథనాలు