Shahid Afridi : ఇర్ఫాన్ పఠాన్‌పై షాహిద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌పై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మగాడివైతే ముందుకొచ్చి మాట్లాడంటూ పాక్ మీడియాలో రెచ్చిపోయాడు. 

New Update
irfan

ఇండియన్ క్రికెటర్లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల పిచ్చికూతలు కూస్తున్నారు. ఇటీవల ఆ దేశ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను పంది అని సంభోదించాడు. ఓ ఇంటర్వ్యూలో పలుసార్లు సూర్యకుమార్‌ను అలాగే పిలిచాడు.  తాజాగా మరో క్రికెటర్ నోరు పారేసుకున్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌పై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మగాడివైతే ముందుకొచ్చి మాట్లాడంటూ పాక్ మీడియాలో రెచ్చిపోయాడు. 

ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు

ఇర్ఫాన్ పఠాన్‌ ఒక నిజమైన క్రికెటర్. అటువంటి స్థాయిలో ఉండి కూడా ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అదంతా అబద్ధం. మనుషులకు మర్యాద ఇవ్వడం మాకు అలవాటు. ఇలాంటి అసత్యాలు చెప్పకూడదు. అతనికి ఇలాంటివన్నీ ఎలా తెలుస్తాయో నాకర్థం కావట్లేదు అని అన్నాడు.  ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలను అఫ్రిది ఖండిస్తూ, అది పాకిస్తాన్‌ను బద్నాం చేయడానికి ఉద్దేశించినదని ఆరోపించాడు. 

నేను మగాడని అనుకుంటాను.. ముందుకొచ్చి, కళ్లల్లో కళ్లు పెట్టి మాట్లాడేవాడ్ని.  ముందుకొచ్చి మాట్లాడు అన్నిటికీ సమాధానం చెబుతాను.ఇర్ఫాన్ సోషల్ మీడియాలో తానో పెద్ద ఇండియన్‌ను, పాకిస్తాన్ వ్యతిరేకిని అని నిరూపించుకుంటూనే ఉంటాడని షాహిద్ అఫ్రిది ఫైరయ్యాడు.  కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాహిద్‌ అఫ్రిదీ ప్రవర్తనపై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ చేశారు. అఫ్రిదీ తనను బచ్చా అంటూ సంబోంధించాడన్నాడు. వీరి ఈ వివాదం రెండు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.

Also Read : KRAMP Teaser: నాన్‌స్టాప్ కిస్సింగ్స్.. K-RAMP టీజర్‌లో రెచ్చిపోయిన కిరణ్ అబ్బవరం

Advertisment
తాజా కథనాలు