IND-W vs AUS-W: పింక్ జెర్సీలో టీం ఇండియా.. ప్రశంసిస్తున్న ఫ్యాన్స్ - అసలు కారణం ఇదే..!

భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో గులాబీ రంగు జెర్సీలు ధరించింది. రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం అని BCCI పేర్కొంది. దీనికి సంబంధించిన పోస్ట్‌ను సోషల్ మీడియాలో సేర్ చేసింది.

New Update
IND-W vs AUS-W

IND-W vs AUS-W

టీమిండియా(team-india) Vs ఆస్ట్రేలియా(australia) మహిళా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రస్తుతం జరుగుతోంది. త్వరలో 2025 మహిళల ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. దీని కంటే ముందు ఇది ఈ రెండు దేశాలకు వార్మప్‌గా ఉపయోగపడుతుంది. కాగా ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తవ్వగా.. ఇవాళ మూడవ మ్యాచ్ జరుగుతోంది. ఈ మూడో మ్యాచ్‌ కోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళా జట్టు ఈ సిరీస్‌లోని మూడో ODIలో బ్లూ కలర్ జెర్సీలో కాకుండా పింక్ కలర్ జెర్సీలను ధరించి ఆడుతుంది. అయితే ఇలా చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందని బీసీసీఐ తెలిపింది. అది తెలిసి క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. 

Also Read :  IND vs PAK : పాక్ తో మ్యాచ్.. టీమిండియాకు బిగ్ షాక్.. కీలక బౌలర్ ఔట్!

IND-W vs AUS-W

దీనికి గల కారణాన్ని బీసీసీఐ(bcci) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో పింక్ కలర్ జెర్సీలు ధరించడానికి ఒక ప్రత్యేక కారణం ఉందని తెలిపింది. రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) గురించి అవగాహన కల్పించడమే ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం అని పేర్కొంది. ఆ పోస్టులో టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఇతర సభ్యులు రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. 

Also Read :  మ్యాచ్‌కి హైలెట్ అతనే.. ఒమన్‌పై ప్రశంసంల జల్లు కురిపించిన టీమిండియా కెప్టెన్ స్కై!

పింక్ కలర్ జెర్సీలు ధరించడం ద్వారా.. రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం, ప్రాథమికంగా గుర్తించడం, దానిని ఎదుర్కోవడానికి ఉన్న మార్గాలపై ప్రజలకు తెలియజేయాలని జట్టు భావించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ ద్వారా మహిళల్లో స్వయం-పరీక్ష (self-examination) చేసుకోవాలనే అలవాటును ప్రోత్సహించడం కూడా దీని లక్ష్యం. ఈ చర్యతో భారత మహిళా జట్టు ఒక ముఖ్యమైన సామాజిక సమస్యపై దృష్టిని ఆకర్షించి, సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చిందంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

క్రికెట్ ప్రపంచంలో ఇది ఒక ప్రముఖ సంప్రదాయం. ఆస్ట్రేలియా పురుషుల జట్టు కూడా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రతి సంవత్సరం ‘పింక్ టెస్ట్’ ఆడుతుంది. దీనికి అసలు కారణం.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ భార్య జేన్ మెక్‌గ్రాత్ రొమ్ము క్యాన్సర్‌తో మరణించారు. ఆమె స్మారకార్థం.. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి మద్దతుగా ఈ 'పింక్ టెస్ట్' నిర్వహిస్తారు. దీని ద్వారా మెక్‌గ్రాత్ ఫౌండేషన్ కోసం నిధులు కూడా సేకరిస్తారు.

ఇదిలా ఉంటే భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. అభిమానులు ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌, ఆన్‌లైన్‌లో జియోహాట్‌స్టార్‌లో చూడొచ్చు.

Advertisment
తాజా కథనాలు