/rtv/media/media_files/2025/10/15/shubman-gill-special-message-to-rohit-sharma-and-virat-kohli-before-leaving-for-australia-2025-10-15-15-38-12.jpg)
shubman gill special message to rohit sharma and virat kohli before leaving for australia
టీమిండియా(team-india) ఫుల్ జోష్ లో ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇటీవలే 2025 ఆసియా కప్(Asia cup 2025) ట్రోఫీని కైవసం చేసుకుంది. పాక్ తో ఫైనల్ మ్యాచ్ లో అదరగొట్టి కప్పును దక్కించుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడింది. న్యూ ఢిల్లీలో జరిగిన ఈ సిరీస్ ను కూడా భారత్ సొంతం చేసుకుంది. వెస్టిండీస్ పై 2-0 తేడాతో సిరీస్ ను గెలుపొందింది. ఇక ఇప్పుడు అందరి చూపు త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ పైనే ఉంది.
Also Read : దానికి ఇంకా రెండున్నరేళ్ళ టైమ్ ఉంది..ఇప్పుడు ఆడకపోతే కష్టం..రోకోపై కోచ్ గంభీర్
గిల్ ఆసక్తికర మెసేజ్
భారత్, ఆస్ట్రేలియా(ind vs aus) మధ్య వన్డే సిరీస్, టీ 20 సిరీస్ జరగనుంది. ఇందులో వన్డే సిరీస్ లో విరాట్, రోహిత్ వంటి దిగ్గజ ప్లేయర్లు రంగంలోకి దిగబోతున్నారు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(rohith-sharma)లపై ఆసక్తికర మెసేజ్ చేశాడు.
ఆరు నెలల తర్వాత ఇద్దరు అనుభవజ్ఞులు అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చే సిరీస్ ఇదని అన్నాడు. రోహిత్, కోహ్లీ సంవత్సరాలుగా చేసిన పనిని ఇప్పుడు చేయాలని జట్టు ఆశిస్తున్నట్లు గిల్ చెప్పాడు. భారతదేశాన్ని విజయపథంలో నడిపించండి అని తెలిపాడు. గిల్ ఏమన్నాడో అనే విషయానికొస్తే..
''వారు గతంలో భారతదేశం తరపున అనేక మ్యాచ్‌లను గెలిచిన ఆటగాళ్లు. వారిద్దరూ గత 10-15 సంవత్సరాలుగా భారతదేశం తరపున ఆడుతున్నారు. వారు తీసుకువచ్చే అనుభవం ప్రతి కెప్టెన్, ప్రతి జట్టుకు అమూల్యమైనది. వారు మైదానంలోకి దిగి తమ మ్యాజిక్‌ను చూపిస్తారని మేము ఆశిస్తున్నాము" అని గిల్ అన్నాడు.
''రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చివరిసారిగా IPL 2025 లో పోటీ క్రికెట్ ఆడారు. ఇద్దరూ టెస్ట్, T20 ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యారు. ఇప్పుడు 2027 ODI ప్రపంచ కప్ లక్ష్యంగా ODI క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నారు. ముఖ్యంగా ఇంత సుదీర్ఘ విరామం తర్వాత వారి ఫామ్, ఫిట్‌నెస్ గురించి ఎంతో హ్యాపీగా ఉంది. వన్డే సెటప్‌లో ఇద్దరు ఆటగాళ్లు ముఖ్యమైన భాగాలుగా ఉంటారని, జట్టుకు వారి అనుభవం చాలా అవసరమం" అని గిల్ స్పష్టం చేశాడు.
అక్టోబర్ 19న పెర్త్‌లో భారత్ సిరీస్‌ను ప్రారంభించనుంది. రెండవ మ్యాచ్ అక్టోబర్ 23న అడిలైడ్‌లో, మూడవ, చివరి మ్యాచ్ అక్టోబర్ 25న సిడ్నీలో జరుగుతుంది. వన్డే సిరీస్ తర్వాత, భారత్ ఆస్ట్రేలియాలో ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌ను కూడా ఆడనుంది.
Also Read : HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం .. రాచకొండ సీపీకి ఫిర్యాదు!