Smriti Mandhana : వారేవా.. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన స్మృతి మంధానా
స్మృతి మంధానా తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ, వన్డే క్రికెట్లో ఒక అరుదైన రికార్డును నెలకొల్పింది. పురుషులు, మహిళల క్రికెట్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ సాధించిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డును మంధాన బద్దలు కొట్టింది.