Rohith-Kohli: దానికి ఇంకా రెండున్నరేళ్ళ టైమ్ ఉంది..ఇప్పుడు ఆడకపోతే కష్టం..రోకోపై కోచ్ గంభీర్

భారత జట్టు సీనియర్ ఆటగాళ్ళు వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు ఆడతామని అంటున్నారు. దానికోసం ఫిట్ నెస్ తో పాటూ అన్నింటి మీదా శ్రద్ధ పెడుతున్నారు. కానీ కోచ్ గంభీర్ మాత్రం దానికి ఇంకా రెండున్నరేళ్ళు టైమ్ ఉంది..ఇప్పుడు ఆడనివ్వండి చూద్దాం అంటున్నాడు. 

New Update
Gautam Gambhir Slammed For Poor Tactics After England Makes Solid Mark

india coach slammed as england take control in manchester test

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ...సీనియర్ స్టార్ ఆటగాళ్ళు ఇద్దరూ ఒకేసారి టీ20, టెస్ట్ లు రెండిటికీ రిటైర్ మెంట్ ప్రకటించారు. టీ20వరల్డ్ కప్ తర్వాత ఇప్పటి వరకు ఐపీఎల్ తప్పితే భారత్ కోసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దాదాపు ఏడాదిన్నర పైగా జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యలో భారత జట్టు వన్డేలు ఆడకపోవడమే దీనికి కారణం. దీంతో రోహిత్ విరాట్ లను ఇక జట్టులోకి తీసుకోరు అని అనుకున్నారు అందరూ. రోహిత్ ఫిట్ నెస్ మీదనా అనుమానాలు రేకెత్తాయి. అయితే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ రోకోలు ఫిట్ గా తయారయ్యారు. దాంతో పాటూ ఆస్ట్రేలియా వన్డే సీరీస్ కు ఎంపిక అయ్యారు. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించినా..జట్టులో మాత్రం కొనసాగించారు సెలెక్టర్లు. ఇప్పుడు ఈ స్టార్ ఆటగాళ్ళు ఇద్దరూ తమ లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ అనే చెబుతున్నారు. దాని కోసం కుర్రాళ్ళకు ధీటుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. దాంతో పాటూ వచ్చే ఆస్ట్రేలియా టూర్ లో కూడా చితక్కొట్టడానికి రెడీ అవుతున్నారు. 

వర్తమానం చాలా ముఖ్యం..

ప్రస్తుతానికి రోహిత్, కోహ్లీలను జట్టులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియా టూర్ అయితే ఆడనిస్తున్ఆరు. అయితే ప్రపంచ కప్ వరకు ఉంచడం సందేహమే అంటున్నారు. ఇద్దరు దిగ్గజాలు ప్రపంచకప్‌లో ఆడుతారని కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ పరోక్షంగా హింట్ ఇచ్చినా అందరికి అనుమానాలే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై కోచ్ గంభీర్ కూడా స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు గురించి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ..వన్డే వరల్డ్ కప్ కు ఇంకా రెండున్నరేళ్ళ టైమ్ ఉంది. దాని కంటే ముందు ఇప్పుడు ఆడ్డం చాలా ముఖ్యమని సమాధానమిచ్చాడు. రోహిత్, విరాట్ లు ఇద్దరూ చాలా సీనియర్ ఆటగాళ్ళు..వీరి అనుభవం ఆస్ట్రేలియా పర్యటనలో పనికి వస్తుందని చెప్పాడు. ఇద్దరూ ఆసీస్ టూర్ లో పక్సెస్ అవుతారని అనుకుంటున్నానని గంభీర్ అన్నాడు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియాతో వన్డే సీరీస్ గెలవడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఈ సీరీస్ అక్టోబర్ 19 నుంచి మొదలవనుంది. 

Also Read: Postal Services: అమెరికాకు మళ్ళీ తపాలా సర్వీసులు..ఈరోజు నుంచే

Advertisment
తాజా కథనాలు