Rohit Sharma: అక్టోబర్ 19.. చరిత్ర సృష్టించనున్న హిట్ మ్యాన్.. సచిన్, కోహ్లీ, ధోని తర్వాత
ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19న జరిగే తొలి వన్డేలో రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకోనున్నాడు. ఈ మ్యాచ్ రోహిత్కు అంతర్జాతీయ క్రికెట్లో 500వ మ్యాచ్ కానుంది. సచిన్, కోహ్లీ, ధోని, ద్రావిడ్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న ఐదో భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించనున్నాడు.