🔴 RCB vs PBKS Final Live Updates : 18 ఏళ్ల RCB కల నెరవేరింది!

అహ్మదాబాద్‌ వేదికగా ఐపీఎల్2025 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ట్రోఫీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లలో ఏ టీమ్ గెలిచిన చరిత్రే అవుతుంది. ఇంతవరకు ఇరు జట్లు కప్ కొట్టలేదు. మరి ఏ టీమ్ కప్ సాధిస్తుందో చూడాలి.

author-image
By Krishna
New Update
IPL 2025 Final

  • Jun 03, 2025 23:30 IST

    Karnataka | Cricket fans in Bengaluru celebrate as Royal Challengers Bengaluru



  • Jun 03, 2025 23:28 IST

    IPL FINALS: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

     ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్ళ ఈ సాలా కప్ నమ్దే కల నెరవేరింది. విరాట్ కోహ్లీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఐపీఎల్ 18 సీజన్ కప్ ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయగర్వంతో ఎత్తుకుంది. 

    ipl
    RCB Won The Title

     



  • Jun 03, 2025 23:24 IST

    18 ఏళ్ల RCB కల నెరవేరింది!



  • Jun 03, 2025 23:16 IST

    ఏడో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్..

    యాష్ దయాల్ బౌలింగ్ లో భాండగే కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు వెళ్లిన అజమాతుల్లాహ్ ఓమర్జా (1).



  • Jun 03, 2025 23:11 IST

    ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్..

    భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో యాష్ దయాల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు వెళ్లిన స్టోనిస్స్ (6).



  • Jun 03, 2025 23:10 IST

    * 136 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్

    * భువనేశ్వర్ బౌలింగ్ లో నేహాల్ వధేరా 15 పరుగుల వద్ద ఔట్
    * పంజాబ్ విజయానికి 22 బంతుల్లో 55 రన్స్ కావాలి
    * క్రీజులో శశాంక్ సింగ్ 22, స్టోయినిస్ 
    * బంతి బంతికి ఫ్యాన్స్‎లో పెరుగుతోన్న ఉత్కంఠ



  • Jun 03, 2025 23:04 IST

    * 15 ఓవర్లకు 119 పరుగులు చేసిన పంజాబ్

    * క్రీజులో శశాంక్ సింగ్ 9, నేహల్ వధేరా 13
    * 15వ ఓవర్లో 13 పరుగులు రాబట్టిన పంజాబ్
    * పంజాబ్ విజయానికి చివరి ఐదు ఓవర్లలో 72 పరుగులు చేయాలి



  • Jun 03, 2025 22:59 IST

    RCB VS PBKS: నిరాశపర్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ..మాజీల అసంతృప్తి

    అహ్మదాబాద్ లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 191 పరుగుల టార్గెట్ ను పంజాబ్ కు ఇచ్చింది. ఇందులో విరాట్ 43 పరుగులు పరుగులు కొట్టాడు. కానీ బంతులను చాలానే తినేశాడు. దీనిపై మాజీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

    kohli-769



  • Jun 03, 2025 22:56 IST

    RCB vs PBKS : కృనాల్‌ దెబ్బ.. కష్టాల్లో పంజాబ్ .. 4 కీలక వికెట్లు డౌన్

    ఆర్సీబీతో జరగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ తీవ్ర కష్టాల్లో పడింది. ఏకంగా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 12.1 ఓవర్లకు 98 పరుగలకు 4 కీలక వికెట్లను చేజార్చుకుంది.

     



  • Jun 03, 2025 22:51 IST

    పంజాబ్ కింగ్స్‌కు మరో షాక్

    ప్రమాదకరమైన జోష్ ఇంగ్లిస్ (39)ను ఔట్ చేసిన బెంగళూరు
    కృనాల్ పాండ్య వేసిన (12.2వ ఓవర్) బంతిని భారీషాట్‌కు యత్నించిన ఇంగ్లిస్
    బౌండరీ లైన్‌ వద్ద లివింగ్‌స్టోన్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు
    దీంతో 98 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయిన పంజాబ్



  • Jun 03, 2025 22:47 IST

    * నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్

    * 13 ఓవర్ తొలి బంతికి జోస్ ఇంగ్లీస్ ఔట్
    * భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా క్యాచ్ పట్టిన లివింగ్ స్టో్న్
    * రెండు వికెట్లు తీసిన కృనాల్ పాండ్యా
    * పంజాబ్ విజయానికి ఇంకా 47 బంతుల్లో 93 పరుగులు అవసరం



  • Jun 03, 2025 22:46 IST

    RCB VS PBKS: మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్.. శ్రేయస్ ఔట్

     అహ్మదాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ లో ప్రసత్తుం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది.  మొదట లేకపోయినా ఆర్సీబీ నెమ్మదిగా ఫామ్ లోకి వచ్చింది. వరుసగా రెండు వికెట్లను తీసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు.

    ipl
    Shreyas Ayyar

     



  • Jun 03, 2025 22:31 IST

    పంజాబ్ కింగ్స్‌కు షాక్.. 

    మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ 
    శ్రేయస్‌ అయ్యర్ (1)ఔట్



  • Jun 03, 2025 22:29 IST

    రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ 

    ప్రభ్‌ సిమ్రన్ సింగ్ (26) ఔట్
    కృనాల్ పాండ్యా బౌలింగ్ లో భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్
    ప్రస్తుతం పంజాబ్ స్కోరు 8.3 ఓవర్లకు 73/2



  • Jun 03, 2025 22:04 IST

    మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్

    * ఐదో ఓవర్ చివరి బంతికి ప్రియాన్ష్ ఆర్య 24(19) ఔట్
    * హేజిల్ వుడ్ బౌలింగ్లో షాట్కు యత్నం
    * సూపర్ క్యాచ్ పట్టిన సాల్ట్
    * పంజాబ్ స్కోర్ ఐదు ఓవర్లకు 43/1



  • Jun 03, 2025 21:53 IST

    2 ఓవర్లు.. పంజాబ్ స్కోరు 23/0



  • Jun 03, 2025 21:43 IST

    బెంగళూరు సమష్టి పోరు.. పంజాబ్‌ టార్గెట్‌ 191



  • Jun 03, 2025 21:29 IST

    ఐపీఎల్ ఫైనల్ లో తడబడిన ఆర్సీబీ

    నిర్ణీయ 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
    చివరి ఓవర్లలో 3 వికెట్లు తీసుకుని ఆర్సీబీని దెబ్బకొట్టిన అర్ష్‌దీప్ సింగ్



  • Jun 03, 2025 21:24 IST

    Punjab Target 191

    ఐపీఎల్‌ ఫైనల్‌: పంజాబ్‌ టార్గెట్‌ 191 పరుగులు
    బెంగళూరు స్కోర్‌ 190/9



  • Jun 03, 2025 21:23 IST

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..

    19.4 ఓవర్‌ వేసిన అర్ష్ దీప్ బౌలింగ్ లో శ్రేయాస్ అయ్యర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన కృనాల్ పాండ్యా..



  • Jun 03, 2025 21:22 IST

    ఏడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..

    19.2 ఓవర్‌ వేసిన అర్ష్ దీప్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన రొమారియో షెఫర్డ్ (17).



  • Jun 03, 2025 21:13 IST

    * ఆర్సీబీ 200 స్కోర్ ఆశలు గల్లంతేనా..?

    * ఆరో వికెట్ కోల్పోయిన జితేష్ శర్మ
    * విజయ్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్
    * 18 ఓవర్లు ముగిసేసరికి RCB స్కోర్ 173/6



  • Jun 03, 2025 21:07 IST

    లివింగ్‌స్టన్ (25) ఔట్.. ఆర్సీబీ ఐదో వికెట్

    * 15 బంతుల్లో 25 పరుగులు చేసి లివింగ్ స్టోన్ ఔట్
    * ఆర్సీబీ స్కోర్ 17 ఓవర్లకు 168/5



  • Jun 03, 2025 20:49 IST

    విరాట్ కోహ్లీ ఔట్!

    బెంగళూరు నాలుగో వికెట్ డౌన్
    స్కోర్ 131/4



  • Jun 03, 2025 20:40 IST

    ఐపీఎల్‌లో మరో చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఏకైక ప్లేయర్



  • Jun 03, 2025 20:37 IST

    రజత్ పటీదార్ (26) ఔట్.. బెంగళూరు మూడో వికెట్

    ఆర్సీబీ 96 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 
    రజత్ పటీదార్ (26; 16 బంతుల్లో) ఔట్



  • Jun 03, 2025 20:35 IST

    ఐపీఎల్‌ మ్యాచ్‌కు బ్రిటన్ మాజీ అధ్యక్షుడు రిషి సునాక్..

    ఐపీఎల్‌లో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌ వచ్చారు. తన భార్యతో కలిసి మ్యాచ్‌ చూస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్ జై షా పక్కనే వాళ్లు కూర్చోని మ్యాచ్‌ వీక్షిస్తున్నారు.

    Britain Ex PM Rsihi sunak Appears in ipl final Match
    Britain Ex PM Rsihi sunak Appears in ipl final Match

     



  • Jun 03, 2025 20:19 IST

    ఇంగ్లండ్‌కు బయల్దేరిన కేఎల్‌ రాహుల్‌



  • Jun 03, 2025 20:14 IST

    IPL 2025 : RCB రెండో వికెట్ డౌన్.. హిట్టర్లు గోవిందా!

    అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ తో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి వరుసగా రెండు బిగ్ షాకులు తగిలాయి. ఆర్సీబీ హిట్టర్లు ఫిల్ సాల్ట్ (16),  మయాంక్ అగర్వాల్ (24) పరుగులకే ఔటయ్యారు.

    rcb-3



  • Jun 03, 2025 20:03 IST

    రెండో వికెట్ డౌన్.. హిట్టర్లు గోవిందా!

    * 56 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు జట్టు
    * చాహల్ మాయాజాలం.. మయాంక్ అగర్వాల్ 24(18) ఔట్
    * విరాట్ కోహ్లీ 13 (10), మయాంక్ అగర్వాల్ 24 (17)
    * పవర్ ప్లేలో ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసిన బెంగళూరు



  • Jun 03, 2025 19:57 IST

    5 ఓవర్లలో ఆర్సబీ 46/1

    కోహ్లీ 11, అగర్వాల్ 16



  • Jun 03, 2025 19:51 IST

    బెంగళూరుకు రెండో ఓవర్‌లోనే షాక్ 

    దూకుడుగా ఆడుతున్న ఫిల్ సాల్ట్ (16) ఔటయ్యాడు



  • Jun 03, 2025 19:37 IST

    RCB : ఫస్ట్ ఓవర్ లో 13 పరుగులు

    ఆర్సీబీ, పంజాబ్ మధ్య ఫైనల్ మ్యాచ్ వైడ్‌తో మొదలైంది. 
    మూడో బంతిని  ఫిల్ సాల్ట్ సిక్సు బాదాడు. ఐదో బంతిని ఫోర్ గా మలిచాడు.  
    ఈ ఓవర్ లో 13 పరుగులు వచ్చాయి.



  • Jun 03, 2025 19:36 IST

    సిక్స్ తో మొదలుపెట్టిన ఆర్సీబీ 

    అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ లో  ఫిల్ సాల్ట్ సిక్సు బాదాడు



  • Jun 03, 2025 19:27 IST

    ప్రశాంతంగా ఉంటే అంత మంచిదే : శ్రేయాస్ అయ్యర్

    నా మనసుకు, నా శరీరానికి సానుకూల సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఇది అద్భుతమైన రోజు. జనం ఉత్సాహంగా ఉన్నారు. మనం చేయాల్సిందల్లా ఇక్కడికి వచ్చి వారిని ఆదరించడం. నా టీమ్‌మేట్స్‌ కూడా ఉత్సాహంగా, ఫిట్‌గా ఉన్నారు.  టీమ్ మీటింగ్‌లో కూడా అదే  మాట్లాడుకున్నాం. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది అని చెప్పాను.



  • Jun 03, 2025 19:23 IST

    ఈరోజు #IPLFinals సందర్భంగా క్రికెట్ అభిమానులు సందడి



  • Jun 03, 2025 19:10 IST

    జట్లు ఇవే

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్

    పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్



  • Jun 03, 2025 19:09 IST

    RCB vs Punjab: టాస్ గెలిచిన పంజాబ్.. ఆర్సీబీ బ్యాటింగ్

    ఐపీఎల్‌ 2025 ఫైనల్‌ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్ కింగ్స్‌ బౌలింగ్ ఎంచుకుంది. 

    RCB vs Punjab Kings
    RCB vs Punjab Kings

     



  • Jun 03, 2025 19:08 IST

    RCB గెలుస్తుందని రూ. 6 కోట్ల పందెం వేసిన సింగర్

    ఐపీఎల్ 2025 కప్ ఆర్సీబీ గెలుస్తుందని ప్రముఖ రాపర్ డ్రేక్ రూ.6.41 కోట్లు పందెం వేశాడు. 'ఈ సాలా కప్ నమ్దే' అనే క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టిన డ్రేక్.. తన మద్దతు కోహ్లీ జట్టుకేనని ప్రకటించాడు.

    ipl-rcb-2025



  • Jun 03, 2025 19:05 IST

    RCB vs PBKS : ఐపీఎల్ ఫైనల్.. మోదీ స్టేడియంలో భారీ వర్షం

    ఐపీఎల్ 2025 ఫైనల్  మ్యాచ్  కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్ కు బిగ్ షాక్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం భారీ వర్షం పడుతోంది. స్టేడియంలోకి అడుగుపెట్టిన ఫ్యాన్స్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానం నెలకొంది.

    rcb-vs-punjab



  • Jun 03, 2025 19:04 IST

    ఐపీఎల్ ఫైనల్స్..కోహ్లీ 18 ఏళ్ళ కల నెరవేరుతుందా..

    ఆర్సీబీ ఫైల్ కు వచ్చిందనగానే అన్నింటికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు విరాట్ కోహ్లీ. బెంగళూరు జట్టుకు కప్ రావడం కన్నా కోహ్లీ కప్ ను ఎత్తడం ముఖ్యం అనే చర్చలు నడుస్తున్నాయి. జట్టు కూడా ఇదే ఆలోచిస్తోంది.  మరి స్టార్ బ్యాటర్ పద్ధెనిమిదేళ్ళ కల తీరుతుందా?



  • Jun 03, 2025 19:02 IST

    ఐపీఎల్ కు కొత్త విజేత..ఎవరి కల తీరనుంది?

    పది టీమ్ లు...అలుపెరుగని మ్యాచ్ లు. చివరకు రెండు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఈరోజు తుది పోరుకు సిద్ధమయ్యాయి బెంగళూరు, పంజాబ్ జట్లు. వీటిల్లో ఇప్పటి వరకు ఒక్క జట్టు కూడా కప్ గెలవలేదు. కాబట్టి ఏ టీమ్ గెలిచినా ఐపీఎల్ కు కొత్త ఛాంపియన్ యాడ్ అయినట్లే. 

    ipl
    PBKS VS RCB

     



  • Jun 03, 2025 19:01 IST

    వర్షం పడితే ఫైనల్ మ్యాచ్ ఎలా.. IPL విన్నర్ ను ఎలా డిసైడ్ చేస్తారంటే!?

    ఐపీఎల్ సీజన్ 18 తుది ఘట్టానికి చేరుకుంది. ఈరోజే ఫైనల్ మ్యాచ్. బెంగళూరు, పంజాబ్ కు మధ్య అహ్మదాబాద్ లో ఈరోజు సమరం జరగనుంది. అయితే ఈరోజు కూడా వర్షం పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే కనుక అయితే విన్నర్ ను ఎలా డిసైడ్ చేస్తారు..

    ipl
    RCB VS PBKS

     



  • Jun 03, 2025 18:28 IST

    RCB vs PBKS



  • Jun 03, 2025 18:26 IST

    జట్ల అంచనా

    ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా): ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్.

     

    పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఉమర్‌జాయ్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జమీసన్, విజయ్‌కుమార్ వైషకిన్. 



  • Jun 03, 2025 18:25 IST

    మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్

    ఈ సీజన్‌లో ఈ మైదానం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు ఉపయోగకరంగా ఉంది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 219 పరుగులు. ఈ సీజన్‌లో ఇక్కడ ఆడిన 16 ఇన్నింగ్స్‌లలో జట్లు 11 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేశాయి. 



  • Jun 03, 2025 18:24 IST

    వాతావరణం అప్‌డేట్

    శుభవార్త! అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వర్షం ఆగిపోయినట్లు కనిపిస్తోంది.  టాస్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. 



  • Jun 03, 2025 18:24 IST

     RCB vs PBKS H2H

    ఐపీఎల్ చరిత్రలో RCB, PBKS 36 సార్లు తలపడ్డాయి. ఇరు జట్లు చెరో 18 సార్లు విజయం సాధించాయి.  



  • Jun 03, 2025 18:23 IST

    విరాట్ కోహ్లీ 18 ఏళ్ల నిరీక్షణ

    ఐపీఎల్ 2008లోనే విరాట్ కోహ్లీ ఆర్‌సీబీలో చేరాడు. 18 సంవత్సరాల తర్వాత కోహ్లీ వయసు 36 సంవత్సరాలు, కానీ ఐపీఎల్ టైటిల్ మాత్రం ఆ జట్టు ఇప్పటికీ దక్కలేదు. 2025 సీజన్ లో కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఏకంగా  600 పరుగులు చేశాడు. 



  • Jun 03, 2025 18:20 IST

    ధోని, రోహిత్‌తో చేరనున్న శ్రేయాస్?

    శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ తో టైటిల్ గెలిస్తే, వరుసగా ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన మూడో కెప్టెన్ అవుతాడు. 2010, 2011లో CSKతో ధోని, 2019, 2020లో MI తో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించారు. అయితే అయ్యర్ రెండు వేర్వేరు జట్లతో ఈ ఘనత సాధించిన మొదటి కెప్టెన్ అవుతాడు.  



Advertisment
Advertisment
తాజా కథనాలు