IPL FINALS: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

 ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్ళ ఈ సాలా కప్ నమ్దే కల నెరవేరింది. విరాట్ కోహ్లీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఐపీఎల్ 18 సీజన్ కప్ ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయగర్వంతో ఎత్తుకుంది. ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది.

author-image
By Manogna alamuru
New Update
ipl

RCB

తన 18 ఏళ్ళను కలను నిజం చేసుకుంది. కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ఆర్సీబీ సమిష్టి కృషితో మ్యాచ్ గెలిచి కప్ ను గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 190 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కు ఇచ్చింది. 191 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ను తన బౌలింగ్ తో కట్టడి చేశారు బెంగళూరు బౌలర్లు. మొదట్లో ధారాళంగా పరుగులు ఇచ్చినా..తరువాత వరుస పెట్టి వికెట్లు తీయడంతో మ్యాచ్ ఆర్సీబీ సొంతమైంది. కృనాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. రెండు వికెట్లు తీయడమే కాక అతి తక్కువ పరుగులు ఇచ్చాడు. షెపర్డ్ ఎక్కువ పరుగులు ఇచ్చినా అతి ముఖ్యమైన శ్రేయస్ అయ్యర్ వికెట్ ను తీసి విజయంలో తన వంతు పాత్రను పోషించాడు. మిగతా బౌలర్లు కూడా వికెట్లు తీస్తూ పంజాబ్ కు గెలుపును దూరం చేశారు. 15 ఓవర్లు వచ్చేసరికి మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోకి వచ్చేసింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ బ్యాటర్లు ప్రెషర్ లోకి వెళ్ళిపోయారు. రన్స్ రావడం కూడా తగ్గిపోయింది.  పంజాబ్ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ ఆరు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో గెలుపు బెంగళూరు వశం అయింది. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ చివర వరకు ఉండి మెరుపులు మెరిపించినా లాభం లేకపోయింది. 

Advertisment
తాజా కథనాలు