Champions Trophy: మెగా సమరానికి సై..నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ...

అన్నీ పెద్ద జట్లే..ఒక్కటీ బోర్ కొట్టే మ్యాచ్ ఉండదు. ఏ ఒక్క టీమ్ నీ తక్కువగా అంచనా వేయలేము. 19 రోజులు...15 మ్యాచ్ లు...విజేతగా నిలిచేది ఎవరో...రసవత్తరమైన ఛాంపియన్స్ ట్రోఫీకి తెర లేచేది నేడే...

New Update
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ షెడ్యూల్.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే.. 

ఒకదానిని మించి మరొకటిగా ఉండబోయే మ్యాచ్ లతో..అంచనాలను తారు మారు చేసే ఫలితాలతో నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) మొదలవనుంది. ప్రపంచ టాప్ 8 వన్డే జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది చివరిసారిగా 2017లో జరిగింది. ఆ తర్వాత రద్దయిన ఈ టోర్నీ ఇప్పుడు మళ్ళీ మొదలవనుంది. దీనికి పాకిస్తాన్ ఆతిధ్యం ఇస్తోంది. అయితే భారత్ ఆడే మ్యాచ్ లు అన్నీ మాత్రం దుబాయ్ లో జరగనున్నాయి. మొత్తం ఎనిమిది జట్లలో టీమ్ ఇండియా ఫస్ట్ ఫేవరెట్ అని అనడంలో కూడా ఎలాంటి సందోహం లేదు. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న భారత జట్టు కూడా ఈ టోఫ్రీని ఎలా అయినా గెలవాలని అనుకుంటోంది. వన్డే వరల్డ్ కప్ చివరి నిమిషంలో పోగొట్టుకున్న టీమ్ ఇండియా ఇదైనా గెలిచి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటోంది. 

Also Read :  దిగొచ్చిన బీసీసీఐ.. ఆటగాళ్లు ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు కానీ..!

ఈరోజు పాక్ లో మొదటి మ్యాచ్...

ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ లో ఆతిథ్య జట్టుతో న్యూజిలాండ్ తలపడనుంది. ఇక రేపు బంగ్లాదేశ్ తో టీమ్ ఇండియా (Team India) తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది.  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ టోర్నీలో తలపడుతున్న మిగతా జట్లు. వెస్టిండీస్, శ్రీలంక టోర్నీకి అర్హత సాధించలేకపోయాయి. ఈ టోర్నీలో ఆడుతున్న జట్టు అన్నీ బలంగానే ఉన్నాయి. ఆప్ఘనిస్తాన్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. 

Also Read :  బుద్దిమార్చుకోని పాక్.. భారత్ను అవమానించేలా చిల్లర చేష్టలు!

ఇక ఈ టోర్నీని పాకిస్తాన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆతిథ్యంలోనూ , జట్టు ప్రదర్శన పరంగా కూడా నిరూపించుకోవాలని తహతహలాడుతోంది. 2008లో శ్రీలంక పై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఎవరూ పాకిస్తాన్ లో ఆడేందుకు సాహసించలేదు. పెద్ద జట్లు ఆ దేశ పర్యటనకు రావడానికి చాలా సమయమే పట్టింది. చాలాసార్లు పాక్ బోర్డు తమ దేశంలో మ్యాచ్ లు ఆడించాలని ప్రయత్నించిన సఫలం కాలేకపోయింది. ఇప్పుడు కూడా మిగతా దేశాలన్నీ పాకిస్తాన్ వెళ్ళడానికి ముందుకు వచ్చినా భారత్ మాత్రం ససేమిరా అంది. అందుకే భారత్ ఆడే మ్యాచ్ లు అన్నింటినీ దుబాయ్ లో నిర్వహించాలని డిసైడ్ చేశారు. అందులో కూడా చాలా విమర్శలు ఫేస్ చేసింది పీసీబీ. ఇప్పటికే న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్రకు గాయం అవడానికి కారణం ఫ్లడ్ లైట్లు సరిగ్గా లేకపోవడమే అని విమర్శలు వచ్చాయి. అయితే ఆ వ్యవహారం పెద్ద వివాదంగా మారకుండా ఐసీసీ, పీసీబీ చూసుకున్నాయి. దీంతో టోర్నీ నిర్వహణ ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 

Also Read :  చూసి రెండేళ్లు...మాట్లాడి ఏడాది..కుమారుడ్ని తలచుకుని ఎమోషనల్ అవుతున్న ధావన్‌!

ఇక టోర్నీలో టీమ్ ఇండియా సెమీస్ కు చేరితే రెండు సెమీ ఫైనల్స్ మ్యాచ్ లు జరుగుతాయి. టీమ్ ఇండియా ఆడే మ్యాచ్ దుబాయ్ లో జరుగుతుంది. మరొక దానికి పాకిస్తాన్ ఆతిధ్యమిస్తుంది. అలాగే భారత జట్టు ఫైనల్స్ కు చేరితే తుదిపోరు దుబాయ్ లోనే ఉంటుంది. పాకిస్తాన్ ఫైన్లస్ కు చేరినా కూడా అక్కడే ఆడాలి. ఒకవేళ టీమ్ ఇండియా ఫైనల్ కు చేరకపోతేనే ఫైనల్స్ పాకిస్తాన్ లో జరుగుతుంది. 

Also Read: Cricket: నేనప్పుడే వెళ్ళను..రిటైర్మెంట్ పై రోహిత్ క్లారిటీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు