Cricket: నేనప్పుడే వెళ్ళను..రిటైర్మెంట్ పై రోహిత్ క్లారిటీ

టీ20 వరల్డ్ కప్ సాధించాకనే ఆ ఫార్మాట్ లో నుంచి రిటైర్ అయ్యాం. అలాగే టెస్ట్ లు, వన్డేల్లో మరింత నిరూపించుకోవాలి...జట్టుకు మరిన్న విజయాలు అందించాలి...అప్పటి వరకు నో రిటైర్మెంట్ అని చెప్పకనే చెప్పేశాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.

New Update
Rohith : పిచ్ గురించి తెలిస్తేనే మాట్లాడండి.. టెస్ట్ ఓటమి విమర్శలపై రోహిత్ ఫైర్

వన్డే వరల్డ్ కప్ ఓడిపోయిన దగ్గర నుంచీ జనాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వెంటే పడ్డారు. మ్యాచ్ బాగా ఆడని ప్రతీసారీ వాళ్ళు ఇక రిటైర్ అయిపోతారంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. రీసెంట్ గా స్టార్ బ్యాటార్లు ఇద్దరూ వరుసగా విఫలం అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా సీరీస్ మొత్తంలో రోహిత్ అటు కెప్టెన్ గా, ఇటు బ్యాటర్ గా కూడా ఫెయిల్ అయ్యాడు. దాంతో ఇక అతను రిటైర్ అయిపోవలసిందే అని తీర్మానించేశారు. మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర విమర్శలు చేశారు.  ఇన్నటింటి మధ్యలో కెప్టెన్ రోహిల్ శర్మ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. టీ20 వర్లడ్ కప్ ను అందించాడు. ఆస్ట్రేలియాతో విఫలం అయినా..ఇంగ్లాండ్ తో గెలచి చూపించాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధం అవుతున్నాడు. కానీ మళ్ళీ అతని రిటైర్మెంట్ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ టోర్నీ తరువాత రోహిత్, విరాట్ ఇద్దరూ టెస్ట్ ల నుంచి రిటైర్ అయిపోతారని వార్తలు వస్తూనే ఉన్నాయి..

నేనప్పుడే వెళ్ళను...

మీరెన్ని అనుకున్నా నేను మాత్రం అప్పుడే వెళ్ళేది లేదని కెప్టెన్ రోహిత్ శర్మ హింట్ ఇచ్చాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను ఎక్కడికీ పోను అని చెప్పకనే చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచాం. అది మాకు ఎంతో స్పెషల్. దాని తర్వాత జడ్డూ చెప్పినట్టు టీ20ల నుంచి రిటైర్ అయ్యాం. కానీ మిగిలిన రెండు ఫార్మాట్లలో విజయం సాధించాల్సి ఉంది. అక్కడ కూడా విజయాలు అందుకుని మరింత గర్వపడేలా చేస్తాం. అప్పటివరకు తగ్గేదే ల్యా అని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. దీంతో అతను ఇప్పుడిప్పుడే టెస్ట్ లు, వన్డేల్లో నుంచి రిటైర్ అవ్వనని చెప్పకనే చెప్పేశాడు.  

భారత జట్టు ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు దుబాయ్ చేరుకుంది. అక్కడ ప్రాక్టీస్ చేస్తూ మ్యాచ్ లకు సిద్దం అవుతోంది. ఎలా అయినా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ ట్రోఫీ తటస్థ వేదికలపై జరగనుంది. పాకిస్తాన్ జరిగే మ్యాచ్ లకు భారత్ అక్కడకు వెళ్ళను తేల్చి చెప్పిన కారణాన...టీమ్ ఇండియా తన మ్యాచ్ అన్నింటినీ దుబాయ్, శ్రీలంకలలో ఆడనుంది. 

Also Read: AP: మహా కుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్నానం

 

 

 

 

 

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు