/rtv/media/media_files/2025/02/17/3ieaHv6xNXX6aVtjGRLp.jpg)
shikhar
టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తనకు దూరంగా ఉంటున్న కొడుకుని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. తన కుమారుడు జొరావర్ ను చూసి రెండేళ్లు అయిపోయిందని తెలిపాడు. కొడుకుతో మాట్లాడేందుకు అన్ని దారులు మూసేసినప్పటికీ తాను ఎప్పుడూ ఎలా కనెక్ట్ అయి ఉంటాడో తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కుమారుడి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి బాగా కలిసివస్తుంది...ఏది పట్టుకున్న బంగారమే!
కొడుకుని చూసి రెండేళ్లయ్యింది. తనతో చివరగా సంవత్సరం క్రితం మాట్లాడాను.చాలా కష్టంగా ఉన్నా అలానే ఉండటం నేర్చుకున్నా.తనతో నేరుగా మాట్లాడకపోయినా, కలవకపోయినా మనసులో ఎప్పుడూ మాట్లాడుతున్నట్లు , కౌగిలించుకున్నట్లు భావిస్తుంటాం. నా కొడుకుని కలిసేందుకు ఇదే సరైన మార్గం.
Also Read: Kumbh Mela: మరో తొమ్మిదే రోజులే ఉన్నా..ఏ మాత్రం తగ్గని జనం...రైల్వేశాఖ అలర్ట్!
బాధపడితే ఏ ప్రయోజనం ఉండదు. ఇప్పుడు జొరావర్ వయసు 11 ఏళ్లు. కేవలం తనతో రెండున్నరేళ్లు మాత్రమే వాడితో గడిపాను అంటూ ధావన్ చెప్పుకొచ్చాడు.కొడుకుని కలవగానే మీరు ఆడిన ఏ ఇన్నింగ్స్ చూపిస్తారు అని ప్రశ్నించగా..ధావన్ భావోద్వేగానికి గురయ్యాడు.
తనతో పాటు నేను కూడా ఏడుస్తా..
ఫస్ట్ జొరావర్ ను హగ్ చేసుకుంటా..తనతో సమయం గడుపుతా..ఏం చెప్పాలనుకుంటున్నాడో మొత్తం వింటాను. ఒకవేళ ఏడిస్తే తనతో పాటు నేను కూడా ఏడుస్తా. తనతో ఉన్నంత సేపు ఆ సమయాన్ని ఆస్వాదిస్తా. ఇన్నింగ్స్ చూపించాలనే ఆలోచన లేదు. ఇక నన్ను బ్లాక్ చేసినప్పటికీ ప్రతి మూడు, నాలుగు రోజులకు ఓ సారి మెసేజ్ చేస్తూనే ఉన్నాను.
ఆ మెసేజ్ లను జొరావర్ చదువుతాడని నేను అనుకోను,ఒకవేళ చదవకపోయినా ఏం ఫర్వాలేదు.తనకు మాత్రం మెసేజ్ చేయడం నా బాధ్యత.చేస్తూనే ఉంటా అని ధావన్ అన్నాడు. జొరావర్ ఎప్పుడూ ఆరోగ్యంగా , సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.2023 అక్టోబర్ లోనే ధావన్ కు, ఆయన భార్య అయేషా ముఖర్జీకి విడాకులైన సంగతి తెలిసిందే.
అప్పటికి రెండేళ్ల క్రితమే తాము విడిపోతున్నట్లు ధావన్ దంపతులు ప్రకటించారు. అయితే తన కుమారుడి శాశ్వత కస్టడీ కోసం ధావన్ చేసిన అభ్యర్థన పై ఆదేశాలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కానీ ధావన్ తన కుమారుడితో వీడియో కాల్ లో మాట్లాడేందుకు అనుమతులు ఇచ్చింది. అయినప్పటికీ కొడుకుతో మాట్లాడేందుకు వీలు లేకుండా తనను బ్లాక్ చేశారని ధావన్ తెలిపాడు.
Also Read: Mauritius:మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద్ అరెస్ట్!
Also Read: TTD: తిరుమలలో ఆ ఐదు రోజులు ఆర్జిత సేవలు రద్దు.. !